నారా రోహిత్ సినిమా లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్

nara-rohit-ilaya-raja
నారా రోహిత్.. విలక్షణ కథాంశాలను ఎంచుకుంటూ తెలుగు హీరోల్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న హీరో. ప్రస్తుతం తెలుగులో ఏ హీరో కూడా లేనంత బిజీగా నారా రోహిత్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. సుమారు తొమ్మిది సినిమాలను లైన్లో పెట్టి వాటన్నింటినీ పకడ్బందీగా దేనికదే డిఫరెంట్‌గా ఉండేలా చూసుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే పండగలా వచ్చాడు, అప్పట్లో ఒకడుండేవాడు, సావిత్రి, తుంటరి సినిమాలను చివరిదశకు చేర్చడమే కాకుండా వీరుడు, కథలో రాజకుమారి, జ్యో అచ్యుతానంద, రాజా చెయ్యి వేస్తే సినిమాలని లైన్లో పెట్టారు.

ఇక ఈ సినిమాల్లో ఒకటైన కథలో రాజకుమారి సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనుంది. మహేష్ సూరపనేని అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ రూపొందుతోన్న ఈ సినిమాకు లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతం సమకూర్చనున్నారు. ఒక ఫీల్‍గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఇక మ్యూజికల్‌గా మంచి ప్రాధాన్యత ఉన్న కథ కావడంతో ఈ సినిమాకు ఇళయరాజాను సంగీత దర్శకుడిగా సంప్రదించారు. త్వరలోనే ఈ సినిమాను కూడా సెట్స్‌పైకి తీసుకెళ్ళేలా నారా రోహిత్ ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version