బాలు గారి మరణంపై లెజెండరీ గాయని పి సుశీల భావోద్వేగం!

బాలు గారి మరణంపై లెజెండరీ గాయని పి సుశీల భావోద్వేగం!

Published on Sep 26, 2020 12:06 PM IST

భారతీయ సంగీత ప్రపంచ ఏక ఛత్రాధిపతి లెజెండరీ గాయకులు ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం గారి గొంతు మూగబోయింది. ఆయన మరణం ఏ రకంగా కూడా వర్ణించలేనిది. దీనితో అనేక మంది తమ భావాలను అత్యంత భావోద్వేగంతో వ్యక్తపరుస్తున్నారు. ఇప్పటికే చాలా మంది మహామవులు ఆ మహనీయుని ఆత్మకు శాంతి చేకూరాలని తమ ప్రఘాడ సానుభూతిని తెలియజేసారు.

అయితే ఈ వార్త విన్న మన దేశపు మరో లెజెండరీ గాయని పి సుశీల గారు అత్యంత భావోద్వేగానికి లోనయ్యి ఆయనతో ఉన్న మధుర జ్ఞ్యాపకాలను పంచుకున్నారు. బాలు లేడు అనే మాట వినగానే అలా విన్న వెంటనే అందరికీ ఒళ్ళు గగుర్పొడిచింది అని మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో ఉన్న వారు కూడా ఆయన మరణ వార్త వినడంతో ఎంతో దుఃఖిస్తూ ఉంటారని అన్నారు.

తాను మొదటగా ఆయనతో కలిసి అమెరికాకు పాట కచేరీకి వెళ్లామని అక్కడ నుంచి 55 ఏళ్ళు పాటు ఎన్నో పాటలు పాడి ఒక్కసారిగా లోయలో పడినట్టు అయ్యిపోయింది అని భావోద్వేగానికి లోనయ్యారు. బాలు గారు తన మాటలతో ఘంటసాల గారిని సైతం మెప్పించి మైమరపించారని అన్నారు. ఆయనతో మొదటి సారి పాట పడినపుడు చాలా అభినందించారని మరి అలాంటి వ్యక్తి ఇపుడు లేరు అన్న మాట చాలా బాధాకరంగా ఉందని ఆమె తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు