‘లింగ’ పై అంచనాలు పెంచేస్తున్న ఫస్ట్ టీజర్

‘లింగ’ పై అంచనాలు పెంచేస్తున్న ఫస్ట్ టీజర్

Published on Nov 3, 2014 5:27 PM IST

Linga
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన ‘లింగ’ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. బాలన్స్ ఉన్న ఒక్క సాంగ్ షూటింగ్ పూర్తయితే ఈ సినిమాకి గుమ్మడికాయ కొట్టేస్తారు. రెండు రోజుల క్రితమే ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేసారు. ఈ తీజర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. కేవలం రెండు రోజుల్లో ఈ టీజర్ 1.5 మిలియన్ క్లిక్స్ ని క్రాస్ చేయనుంది.

ఈ టీజర్ లో రజినీకాంత్ పలు విభిన్న గెటప్స్ లో కనిపిచడమే కాకుండా భారీ సెట్టింగ్స్, మరియు ఓ ట్రైన్ ఫైట్ సీక్వెన్స్ లోని విజువల్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దాంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయాయి. కెఎస్ రవికుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా నటించారు. ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ ని నవంబర్ 7న రిలీజ్ చేయనున్నారు. రాక్ లైన్ వెంకటేష్ నిర్మించిన ఈ సినిమా రజినీకాంత్ బర్త్ డే కానుకగా డిసెంబర్ 12న రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు