మే డే కానుకగా బాలకృష్ణ ‘లయన్’

మే డే కానుకగా బాలకృష్ణ ‘లయన్’

Published on Mar 18, 2015 9:40 AM IST

balayya-lion
నందమూరి నటసింహం బాలకృష్ణ పవర్ఫుల్ సిబిఐ ఆఫీసర్ గా నటించిన సినిమా ‘లయన్’. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న సినిమాలోని ప్యాచ్ వర్క్ సీన్స్ ని ప్రస్తుతం షూట్ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా ఆడియో లాంచ్ విశేషాలను మీకందించాము. ‘లయన్’ సినిమా ఆడియోని ఏప్రిల్ 9న రిలీజ్ చేయనున్నారు. ఏప్రిల్ 9న శిల్పకళ వేదికలో గ్రాండ్ గా జరగనున్న ఈ ఆడియో లాంచ్ కి ముఖ్య అతిధిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సిఎం చంద్రబాబు నాయుడు హాజరు కానున్నాడు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్ర టీం ఈ సినిమాని మే డే కానుకగా మే 1న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. అప్పటికల్లా అందరికీ సమ్మర్ సెలవులు మొదలవుతాయి. ఆ సీజన్ ఈ సినిమాకి బాగా హెల్ప్ అవుతుందని ఈ చిత్ర టీం భావిస్తోంది. సత్యదేవా దర్శకుడుగా పరిచయమవుతూ చేసిన ఈ సినిమాకి రుద్రపాటి రమణారావు నిర్మాత. మణిశర్మ సంగీతం అందించాడు. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బాలకృష్ణ సినిమా షూటింగ్ లతో పాటు ప్రజాసేవకి కూడా సమానంగా సమయాన్ని కేటాయిస్తున్నాడు. బాలకృష్ణ ఈ సినిమా తర్వాత శ్రీవాస్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడు. ఆ సినిమా మార్చి చివర్లో సెట్స్ పైకి వెళ్లనుంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు