‘లెజెండ్’ లాంటి సూపర్ హిట్ తర్వాత నందమూరి బాలకృష్ణ నటించిన ‘లయన్’ సినిమా భారీ అంచనాల నడుమ నిన్ననే తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి మాస్ ఆడియన్స్ నిఉంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అంతే కాకుండా బాలకృష్ణకి మాస్ ఇమేజ్ ఉన్న అన్ని ఏరియాల్లో మొదటి రోజు స్ట్రాంగ్ కలెక్షన్స్ వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ కి నడిబొడ్డుగా ఉన్న గుంటూరులో బాలకృష్ణకి స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది. మొదటి రోజు లయన్ సినిమాకి అక్కడ స్ట్రాంగ్ ఓపెనింగ్స్ లభించాయి.
మొదటి రోజు గుంటూరులో 72 లక్షల షేర్ ని సాధించింది. రెండవ రోజు కూడా అదే రేంజ్ కలెక్షన్స్ తో కోటి రూపాయల మార్క్ ని క్రాస్ చేస్తుందని అంటున్నారు. అంతే కాకుండా ఓవరాల్ గా రెండు కోట్ల మార్క్ ని క్రాస్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో కూడా స్ట్రాంగ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. సత్య దేవ దర్శకుడిగా పరిచయం అవుతూ చేసిన ఈ సినిమాలో త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్స్ గా నటించారు. రుద్రపాటి రమణారావు నిర్మించిన ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ అందించాడు.


