సమీక్ష : లిసా 3డి – ఇంట్రస్ట్ గా సాగని హారర్ థ్రిల్లర్ !

Published on May 25, 2019 3:59 am IST

విడుదల తేదీ : మే 24, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు : అంజలి, యోగి బాబు, మైమ్ గోపి

దర్శకత్వం : రాజు విశ్వనాథ్

నిర్మాత : సురేష్ కొండేటి

సంగీతం : సంతోష్ దయానిధి

సినిమాటోగ్రఫర్ : పి జి ముత్తయ్య

హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో నటించిన హారర్ థ్రిల్లర్ లిసా. తెలుగు, తమిళ భాషల్లో త్రీడి టెక్నాలజీతో తెరకెక్కిన ఈ చిత్రానికి రాజు విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :

లిసా (అంజలి) తండ్రిని చిన్నప్పుడే కోల్పోయి తన తల్లితో ఒంటరిగా ఉంటుంది. అయితే లిసా యూఎస్ వెళ్ళటానికి అన్నీ ఏర్పాట్లు చేసుకుంటున్న క్రమంలో.. తన తల్లి ఒంటరి అయిపోతుందని ఆమెకు
పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకుంటుంది. కానీ పెళ్లికి తల్లి అంగీకరించదు. ఆమె పెళ్ళికి అంగీకరించాలంటే ఆమె పేరెంట్స్ చెబితేనే ఒప్పుకుంటుందని.. ఇరవై సంవత్సరాల తరువాత మొదటిసారిగా తన అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వస్తోంది. ఆ తరువాత జరిగి కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం అక్కడ లిసాకి వచ్చిన సమస్యలు ఏమిటి ? ఆ సమస్యల నుండి లిసా ఎలా బయట పడింది ? అసలు లిసా అమ్మమ్మ తాతయ్యను కలుసుకుందా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

‘లిసా’ రెగ్యులర్ హారర్ ఫిల్మ్ లా కాకుండా మంచి థీమ్ తో తెరకెక్కింది. ముఖ్యంగా సినిమాను త్రీడి టెక్నాలజీతో తీయడం, సినిమాలో కొన్ని హార‌ర్‌ ఎఫెక్ట్స్ బాగుండటం, అలాగే క్లైమాక్స్ లో సెంటిమెంట్ హైలైట్‌ అవ్వడం వంటి అంశాలు లిసాకి ప్లస్ పాయింట్స్ గా నిలుస్తాయి. ఇక ఫస్ట్ హాఫ్ సరదాగా గడిచిపోతుందనుకుంటుండగా దర్శకుడు ప్రీ ఇంటర్వెల్ సన్నివేశాలలతో కాసేపు హారర్ జోనర్ టచ్ చేసి సినిమాని నిలబట్టే ప్రయత్నం చేసాడు. ఇంటర్వెల్ మరియు ముందు సీన్లు బాగున్నాయి.

ఇక నటీనటుల పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే.. ఎప్పటిలాగే ఈ సినిమాలోనూ అంజలి నటనే హైలైట్ గా నిలుస్తోంది. అలాగే ఈ సినిమాకి మరో ప్రధానాకర్షణ బ్రహ్మానందం. ఆయన తన కామెడీ టైమింగ్ తో కొన్ని సన్నివేశాల్లో తన ముద్ర కనబరుస్తూ కొన్నిచోట్ల నవ్వులు పూయించాడు. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకి న్యాయం చేస్తూ నవ్వించే ప్రయత్నం చేసారు.

మైనస్ పాయింట్స్ :

రెండు గంటలు పాటు లిసా ఆద్యంతం ఉత్కంఠ కలిగిస్తూ ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలం అయింది. దర్శకుడు కనీసం హర్రర్ అండ్ కామెడీ సన్నివేశాలతో కూడా పూర్తిగా ఆకట్టుకోలేకపోయాడు. కథనంలో కొన్ని సీక్వెన్స్ లో ప్లో మిస్ అయింది. బ్రహ్మానందం ట్రాక్ ఎదో కామెడీ కోసం కావాలని పెట్టారు తప్ప, ఆ సీన్లు కథలో మిళితమయ్యి ఉండవు.

ఇక హారర్ సీన్స్ కూడా ఏ సీన్ కి ఆ సీన్ కథ ప్రకారమే సాగుతున్న భావన కలిగినా ఓవరాల్ గా కథనం మాత్రం ముందుకు నడిపించవు. పైగా కొన్ని కామెడీ సీన్స్ కోసమని సినిమా లెంగ్త్ ని పెంచేయడం సినిమాకి మరో మైనస్ పాయింట్. ఇక సెకండాఫ్ మొదలైన 15 నిమిషాల తర్వాత గాని ఆడియన్ అసలు కథలోకి వెళ్ళడు. దీనికి తోడు అక్కడక్కడ తమిళ్ నేటివిటీ సినిమాలో కనిపిస్తోంది.

మొత్తానికి దర్శకుడు సినిమాలోని ఇంట్రస్టింగ్ ఎలెమెంట్స్ ను పక్కన పెట్టి.. పండని కామెడీ అండ్ హార్రర్ సీన్స్ తో కథను డైవర్ట్ చేసారు. కంటెంట్ పరంగా మంచి భావోద్వేగాన్ని పండించే సన్నివేశాలు రాసుకునే అవకాశం ఉన్నా, దర్శకుడు మాత్రం ఆ దిశగా సినిమాని మలచలేకపోయారు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. అందులో మొదటగా చెప్పుకోవాల్సింది దర్శకుడు రాజు విశ్వనాథ్ తీసుకున్న థీమ్ గురించే. పేరెంట్స్ కి పిల్లలకు సంబంధించి మంచి పాయింట్ తీసుకున్నారు అయన. ఇక సినిమాటోగ్రఫీ ఈ హర్రర్ కామెడీ సినిమాకి బాగా సెట్ అయ్యింది. అలాగే సినిమాలో చేసిన గ్రాఫిక్స్ కూడా బాగానే ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ పరంగా కొంచెం స్లోగా సాగిన, సెకెండ్ హాఫ్ ను కట్ చేసిన విధానం బాగుంది. అలాగే నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

తీర్పు :

రాజు విశ్వనాథ్ దర్శకత్వంలో అంజలి ప్రధాన పాత్రలో త్రీడి టెక్నాలజీతో తెరకెక్కిన ఈ హారర్ థ్రిల్లర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సినిమాను త్రీడి టెక్నాలజీతో తీయడం, సినిమాలో కొన్ని హార‌ర్‌ ఎఫెక్ట్స్ బాగుండటం, అలాగే క్లైమాక్స్ లో సెంటిమెంట్ హైలైట్‌ అవ్వడం వంటి అంశాలు పర్వాలేదనిపిస్తాయి. కానీ దర్శకుడు రాసుకున్న కథా కథనాలు ఆసక్తి కరంగా సాగక పోవడం, సినిమాలో కథకు అనవసరమైన పండని కామెడీ సీన్స్ ఎక్కువుగా ఉండటం.. అన్నిటికి మించి సినిమా స్లోగా సాగుతూ బోర్ కొట్టించడం.. వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. మరి ఇలాంటి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనేది చూడాలి.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :

More