ఇంటర్వ్యూ : లక్ష్మి మంచు – స్క్రిప్ట్ విన్నాక ఎగిరి గంతేశాను !

Published on Jul 18, 2018 6:45 pm IST

మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘వైఫ్ అఫ్ రామ్’ . క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంధర్బంగా ఆమె మీడియా తో మాట్లాడారు. ఇప్పుడు ఆ విశేషాలు మీ కోసం..

వైఫ్ అఫ్ రామ్ దేని గురించి ఉండనుంది ?
ఒక ఊహించని సంఘటన వివాహిత మహిళ జీవితాన్ని మార్చివేస్తుంది ఈ కఠినమైన పరిస్థితులను ఆమె ఎలా ఎదుర్కొని విజేతగా ఎలా మారిందనేదే ఈ చిత్ర కథ. థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో పాటలు మరియు కామెడీ ఎపిసోడ్లు వంటి ఏ అనవసరమైన సన్నివేశాలు ఉండవు . ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త రకమైన అనుభూతిని ఇస్తుందని ఆశిస్తున్నాము.

ఈ చిత్రంలో మీ పాత్ర గురించి చెప్పండి ?
ఈ చిత్రంలో నేను ఒక స్వతంత్ర మహిళ అయిన దీక్షా అనే పాత్రను పోషించాను. ఇంతకు ముందు నేను చెప్పినట్లుగా, ఊహించని సంఘటన దీక్ష జీవితాన్ని తలక్రిందులు చేస్తుంది. ఈ సినిమాలో ఎన్నో రకాల భావోద్వేగాలు ప్రదర్శించటానికి నాకు చాలా మంచి అవకాశం దొరికింది.

ట్రైలర్ చూశాక అందరు విద్యాబాలన్ కహాని చిత్రం తో పోలుస్తున్నారు. ఈ చిత్రంలో నిజంగా అటువంటి షేడ్స్ ఏమైనా ఉన్నాయా ?
ఈ రెండు చిత్రాలు స్త్రీ కథతో తెరకెక్కాయి అంతే తప్ప , కహానీ మరియు వైఫ్ అఫ్ రామ్ చిత్రాల మధ్య పోలిక అస్సలు ఉండదు.

మీ డైరెక్టర్ విజయ్ క్రాంతి గురించి ?
అతను నన్ను కలుసుకున్న తరువాత ఈ స్క్రిప్ట్ గురించి చెప్పాడు. స్రిప్ట్ విన్నాక థ్రిల్ గా ఫీల్ అయ్యాను . అతనుకి ఉన్న స్పష్టత మరియు అకింతభావం అతను కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించిన తీరు తన నిజమైన ప్రతిభను ప్రదర్శిస్తుంది.

ఈచిత్రానికి వైఫ్ అఫ్ రామ్ అనే టైటిల్ పెట్టడానికి గల కారణం ?

ప్రారంభంలో, మాకు రెండు మూడు టైటిల్స్ మనసులో ఉన్నాయి కానీ నా సన్నిహిత మిత్రులతో సంప్రదించిన తర్వాత మేము ఈ టైటిల్ ను ఖరారు చేశాం . గ్రామీణ ప్రాంత ప్రేక్షకులు ఈ టైటిల్ తో కనెక్ట్ అవుతారో లేదోనని మొదట్లో నాకు సందేహం ఉండేది. కానీ తరువాత ఈ టైటిల్ సినిమాకి సరిగ్గా సరిపోతుందని భావించాను.

మీ రామ్ గురించి ?
సామ్రాట్ రామ్ పాత్ర పోషించారు. అతను ఉండేది తక్కువ సమయమే అయినా చిత్రంపై తన ప్రభావాన్ని కలిగి ఉంటాడు. రామ్ పాత్రలో అతను చక్కగా నటించాడు.

మీ పనితీరును మీరు ఎలా అంచనా వేస్తారు?
చిత్రం యొక్క అసలు స్పందన తెలుసుకోవటానికి ప్రేక్షకుల తో కలిసి థియేటర్లలో నేను రహస్యంగా సినిమా చూస్తాను. దీని ద్వారా, నేను నా పనితీరులో చేసిన తప్పులను స్పష్టంగా తెలుసుకోవచ్చు.

మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ?
ప్రస్తుతానికైతే నేను కొన్ని స్క్రిప్ట్స్ వింటున్నాను. అలాగే జ్యోతికా ప్రధాన పాత్రలో నటిస్తున్న తమిళ సినిమాలో నటిస్తున్నాను. ఈ చిత్రంతో తమిళ ఇండస్ర్టీలోకి అడుగుపెడుతున్నాను.

సంబంధిత సమాచారం :