
మెగా ఫ్యామిలీ నుంచి ఈమధ్యే ఎంట్రీ ఇచ్చిన హీరో వరుణ్ తేజ్, తాజాగా ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో ‘లోఫర్’ పేరుతో ఓ మాస్ ఎంటర్‌టైనర్‌ను సిద్ధం చేసిన విషయం తెలిసిందే. మదర్ సెంటిమెంట్‌ను హైలైట్ చేసుకొని తెరకెక్కిన ఈ సినిమాను డిసెంబర్ 18న విడుదల చేయనున్నట్లు సినిమా యూనిట్ గతంలో ప్రకటించింది. అయితే తాజాగా సినిమాను ఒకరోజు ముందుగానే అంటే డిసెంబర్ 17నే ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
నిర్మాత సి. కళ్యాణ్ ఇదే విషయమై మాట్లాడుతూ.. డిసెంబర్ 17నే సినిమాను విడుదల చేయనున్నామని, వరుణ్ తేజ్ కెరీర్‌కు ఓ సూపర్ హిట్‌గా ఈ సినిమా నిలుస్తుందని తెలిపారు. ఇక నిన్న సాయంత్రమే ఈ సినిమా ఆడియో రిలీజ్ వేడుక భారీ ఎత్తున జరగ్గా, ఈ సందర్భంగా విడుదలైన ఆడియో, ట్రైలర్‌కు పూరీ అభిమానుల నుండి మంచి రెస్పాన్సే వస్తోంది. వరుణ్ తేజ్ సరసన దిశా పాట్ని హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతం సమకూర్చారు.

