ఈనెల్లోనే సెట్స్‌పైకి పూరీ-వరుణ్ తేజ్‌ల ‘లోఫర్’!

varun-tej-puri
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, వరుణ్ తేజ్‌ల కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే! ‘లోఫర్’ అనే పూరీ స్టైల్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా ఈ నెలలోనే సెట్స్‌పైకి వెళ్ళనుందన్న విషయాన్ని ఇంతకుముందే పూరీ తెలిపారు. సీకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సీ. కళ్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్‌తో పాటు మిగతా ప్రీ ప్రొడక్షన్ కారక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాకు హీరోయిన్‌గా దిశా పటానిని ఎంపిక చేశారు.

ఇక ప్రస్తుతం పూరీ జగన్నాథ్ ‘లోఫర్’ సినిమా స్క్రిప్ట్‌కు మెరుగులు దిద్దే పనితో పాటు చిరంజీవి 150వ సినిమాకు స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో బ్యాంకాక్‌లో ఉన్నారు. పూరీ అక్కణ్ణుంచి వచ్చిన తర్వాత ‘లోఫర్’ షూటింగ్ హైద్రాబాద్‌లో జూలై 9న మొదలు కానుందని తెలుస్తోంది. ఓ మూడు రోజుల షూటింగ్ తర్వాత జూలై 20 నుండి నెలరోజుల పాటు జోధ్‌పూర్‌లో లోఫర్ షూటింగ్ జరగనుందని సమాచారం. ఈ సినిమా ద్వారా వరుణ్ తేజ్‌కు మంచి మాస్ లుక్ ఇచ్చే పనిలో పూరీ జగన్నాథ్ ఉన్నారని సమాచారం.

Exit mobile version