లాక్ చేసిన ‘ఆటోనగర్ సూర్య’ రన్ టైం

లాక్ చేసిన ‘ఆటోనగర్ సూర్య’ రన్ టైం

Published on Jun 25, 2014 8:27 AM IST

Autonagar-Surya

నాగ చైతన్య హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆటోనగర్ సూర్య’. ఈ సినిమాని ఈ శుక్రవారం అనగా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్లాన్ చేసారు. ఈ సినిమాకి ముందుగా సెన్సార్ వారు ‘యు/ఏ’ సర్టిఫికేట్ అనుకున్నారు. కానీ మరోసారి ఈ సినిమాని చూసి వాళ్ళు ఎలాంటి కట్స్ విధించకుండా ‘ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు. అలాగే ఈ సినిమా టోటల్ రన్ టైం ని కూడా లాక్ చేసారు. స్టార్టింగ్ టైటిల్స్, ఎండింగ్ టైటిల్స్ తో కూడా కలుపుకొని ఈ సినిమా రన్ టైం 2 గంటల 37నిమిషాలు ఉంటుంది.

సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నాగ చైతన్య ఓ మెకానిక్ గా కనిపించనున్నాడు. మరో రెండు రోజుల్లో విడుదల కావాల్సిన ఈ సినిమా ఇంకా పలు సమస్యల్లో ఇరుక్కొని ఉంది. వాటినన్నిటినీ క్లియర్ చేసుకొని అనుకున్న టైంకి రిలీజ్ అవుతుందా లేదా అనేదానిపై ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇంకా సరైన క్లారిటీ రాలేదు. దేవకట్టా దర్శకత్వం వహించిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు. భారీ అంచనాలే ఉన్న ఈ సినిమా అంచనాలను మించేలా ఉంటుందా? లేదా? అనేది తెలియాలి అంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే..

తాజా వార్తలు