లాక్ డౌన్ రివ్యూ: నట్కట్ హిందీ షార్ట్ ఫిల్మ్(యూ ట్యూబ్)

లాక్ డౌన్ రివ్యూ: నట్కట్ హిందీ షార్ట్ ఫిల్మ్(యూ ట్యూబ్)

Published on Jun 9, 2020 4:50 PM IST

నటీనటులు: విద్యాబాలన్, సానికా పటేల్, రాజ్ అర్జున్, అతుల్ తివారీ
దర్శకత్వం: షాన్ వ్యాస్
నిర్మించినవారు: రోనీ స్క్రూవాలా, విద్యాబాలన్

మన లాక్ డౌన్ రివ్యూ సిరీస్ లో నేడు యూట్యూబ్ లో విడుదలైన హిందీ షార్ట్ ఫిల్మ్ నట్కట్ ని తీసుకోవడం జరిగింది. విద్యా బాలన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం..

కథాంశం ఏమిటీ?
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చిన్న విలేజ్ అది. సాంప్రదాయ బద్దమైన ఓ గృహిణి(విద్యా బాలన్) తన ఇంటికి వచ్చిన బంధువులకు ఆహారం వడ్డిస్తూ ఉంటుంది. వచ్చిన బంధువులు భోజనం చేస్తూ, వాళ్ళను ఇబ్బంది పెడుతున్న ఓ మహిళ గురించి చెడుగా మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళతో పాటు భోజనం చేస్తున్న సోను కూడా ఆ మహిళను గురించి తప్పుగా మాట్లాడతాడు. చిన్న పిల్లవాడైన సోను ఓ మహిళ గురించి అలా మాట్లాడడం ఆ గృహిణికి బాధ కలిగిస్తుంది. మహిళను ఎలా గౌరవించాలో ఓ రాజు కథ ద్వారా సోనుకు ఆ ఆమె వివరిస్తుంది.

ఏమి బాగుంది?
ఈ షార్ట్ ఫిల్మ్ కోసం ఎంచుకున్న కాన్సెప్ట్ అద్భుతం. ఆడవారిని ఎలా గౌరవించాలి అనే విషయాన్ని చెప్పిన తీరు చాలా బాగుంది. చుట్టూ ఉండే పరిసరాలు పిల్లల లో చెడు ప్రవర్తన ఏర్పడడానికి ఎలా కారణం అవుతున్నాయనేది చక్కగా వివరించారు.

ఇక ఈ షార్ట్ ఫిల్మ్ లో తల్లి పాత్ర చేసిన విద్యా బాలన్ రెండు షేడ్స్ ఉన్న పాత్రలు చాల బాలన్స్డ్ గా చేసింది. ఈ షార్ట్ ఫిల్మ్ కి ఆమె నిర్మాత కూడా కావడం విశేషం. ఇక చిన్న పిల్లవాడు సోను పాత్ర చేసిన సంచిత పటేల్ అద్భుతంగా చేసింది.

ఏమి బాగోలేదు?
ఈ షార్ట్ ఫిల్మ్ లో కొన్ని సన్నివేశాలు వాస్తవానికి దూరంగా ఉన్నాయి. స్కూల్ పిల్లల క్రైమ్ నేచర్ లాంటివి. ఇక ఈ షార్ట్ ఫిల్మ్ బాగా మోరలిస్టిక్ గా ఉంది.

చివరి మాటగా
మొత్తంగా చెప్పాలంటే నట్కట్ ఓ అద్భుతమైన షార్ట్ ఫిల్మ్. పిల్లల వ్యక్తిత్వాన్ని తల్లితండ్రులు ఎలా తీర్చిదిద్దాలి అనే విషయాన్ని చక్కగా చెప్పారు. విద్యాబాలన్ మరియు సంచిత పటేల్ నటన మరో ఆకర్షణ.

Rating: 3/5

సంబంధిత సమాచారం

తాజా వార్తలు