లాక్ డౌన్ రివ్యూ: సైకో తమిళ చిత్రం(నెట్ ఫ్లిక్స్)

నటీనటులు :  ఉదయనిధి స్టాలిన్, అదితి రావు హైదరి, నిత్యా మీనన్, సింగంపులి, రామ్

దర్శకుడు :  మిస్కిన్

నిర్మాతలు :  అరుణ్ మోజి మణికం

సంగీత దర్శకుడు :  ఇళయరాజా

ఛాయాగ్రాహకుడు :  తన్వీర్ మీర్

లాక్ డౌన్ రివ్యూ సిరీస్ లో నేడు తమిళ చిత్రం సైకో ని తీసుకోవడం జరిగింది. ఉదయనిధి స్టాలిన్, రాజ్ కుమార్, అదితి రావ్ హైదరి, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలలో దర్శకుడు మిస్కిన్ తెరకెక్కించిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం..

 

కథాంశం ఏమిటీ?

కోయంబత్తూర్ వేదికగా సైకో కిల్లర్ (రాజ్ కుమార్ పిచ్చుమణి) వరుస హత్యలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతూ ఉంటాడు. అంధుడైన గౌతమ్(ఉదయనిధి స్టాలిన్) దాగినిని(అదితిరావ్ హైదరి) ప్రేమిస్తూ ఉంటాడు. అనుకోకుండా ఓ రోజు దాగిని ని సైకో కిల్లర్ కిడ్నాప్ చేస్తాడు. గుడ్డివాడైన గౌతమ్ ఆ సైకో కిల్లర్ నుండి మాజీ పోలీస్ ఉద్యోగి కమల(నిత్యా మీనన్) సహాయంతో ఎలా కాపాడాడు అనేది మిగతా కథ..

 

ఏమిబాగుంది?

సాధారణంగా డైరెక్టర్ మిస్కిన్ సినిమాలలో కనిపించే ఉత్కంఠ, క్యూరియాసిటీ సైకో సినిమాలో కూడా ఉంది. ఓ సైకో మనస్థత్వం, అతడు ప్రపంచాన్ని చూసే తీరు మిస్కిన్ చక్కగా తెరకెక్కించాడు. సైకో గా చేసిన రాజ్ కుమార్ నటన అద్బుతంగా ఉంది. ఒక ఇంటెలిజెంట్ సెన్సెస్ కలిగిన గుడ్డివాడిగా ఉదయనిధి యాక్టింగ్ బాగుంది.

హీరోయిన్స్ అదితి రావ్ హైదరి, నిత్యా మీనన్ కూడా తమ నటనతో మెప్పించారు. స్క్రీన్ ప్లే కూడా ఆకట్టుకుంటుంది. ఇళయరాజా సంగీతం మరో ఆకర్షణ

 

ఏమి బాగోలేదు?

సైకో రన్ టైం కొంచెం ఎక్కువ కావడంతో పాటు కొన్ని సన్నివేశాలలో దర్శకుడు లాజిక్ ఫాలో కాలేదు. పోలీసులకు కూడా అంతుబట్టని సైకో ట్రిక్స్ గుడ్డివాడైన ఉదయనిధి సాల్వ్ చేయడం నమ్మబుద్ది కాదు.

 

చివరి మాటగా

మంచి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఆసక్తికర సన్నివేశాలలో పాటు, ప్రధాన పాత్రలు చేసిన నటుల అద్భుత నటన ప్రేక్షులకు మంచి అనుభూతిని పంచుతాయి. స్లోగా మొదలయ్యే ఫస్ట్ హాఫ్, లాజిక్ లేని కొన్ని సన్నివేశాలు మినహాయిస్తే సైకో ఒక మంచి మూవీగా చెప్పుకోవచ్చు.

123telugu.com Rating : 3/5

సంబంధిత సమాచారం :

X
More