లాక్ డౌన్ రివ్యూ : వర్జిన్ భానుప్రియ- హిందీ ఫిల్మ్(జీ5)

లాక్ డౌన్ రివ్యూ : వర్జిన్ భానుప్రియ- హిందీ ఫిల్మ్(జీ5)

Published on Jul 18, 2020 2:16 PM IST

నటీనటులు: ఊర్వశి రతేలా, గౌతమ్ గులాటి

దర్శకత్వం: అజయ్ లోహన్

నిర్మాత: శ్రేయాన్స్ మహేంద్ర ధారివాల్

ఛాయాగ్రహణం: జానీ లాల్

సంపాదకీయం: అక్షయ్ మోహన్

లాక్ డౌన్ రివ్యూ సిరీస్ లో భాగంగా నేడు హిందీ ఫిల్మ్ వర్జిన్ భానుప్రియ ను ఇచ్చుకోవడం జరిగింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

 

కథాంశం ఏమిటీ?

జీవితంలో ప్రేమా, శృంగారం అంటే తెలియని భానుప్రియ(ఊర్వశి రతెలా) తన సోల్ మేట్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఆమె ఎంత ప్రయత్నించినా తన ఆశ తీర్చే తోడు దొరకదు. ఐతే ఆమె జాతకంలో ఓ దోషం ఉండడం వలెనే తోడు దొరకడం లేదని జ్యోతిష్కుడు చెవుతాడు. భానుప్రియ జాతకంలో ఉన్న ఆ దోషం ఏమిటీ? దానిని ఆమె ఎలా అధిగమించింది? ఆమె కోరిక చివరికి తీరిందా లేదా అనేది మిగతా కథ…

 

ఏమి బాగుంది?

ఈ మూవీలో చెప్పుకోదగ్గ ఒకే ఒక అంశం హీరోయిన్ ఊర్వశి రాతెలా నటన. గ్లామర్ గర్ల్ ఇమేజ్ కలిగిన ఈమె మంచి నటన కూడా కనబరచగలనని ఈ చిత్రం ద్వారా నిరూపించింది. ఆమె అందం అభినయంతో మూవీని నడిపించింది. ఈ మూవీకి ప్రధాన బలం ఒక్క ఊర్వశి నే అని చెప్పాలి.

 

ఏమి బాగోలేదు?

ముందుగా చెప్పుకున్నట్లు ఈ మూవీలో ఊర్వశి గురించి తప్పా మినహా చెప్పుకొనే అంశాలేవీ లేవు. మిగతా పాత్రలు చేసిన వారి యాక్టింగ్ సి గ్రేడ్ సినిమాల కంటే దారుణంగా ఉంది. ఇక ఎంచుకున్న సబ్జెక్టు మంచిదైనా సిల్లీ సన్నివేశాలు, ఆసక్తి లేని కధనంతో మూవీ సాగింది.

ఇక వర్జినిటీ గురించి ఆడవాళ్ళ మధ్య వచ్చే సన్నివేశాలలోని డైలాగ్స్ చాల వల్గర్ గా ఉన్నాయి. సంప్రదాయ ప్రేక్షకులకు ఈ మూవీలోని డైలాగ్స్ అసలు రుచించవు. ఇక మూవీలో ఎమోషన్స్ అనేవి లేకపోవడం కూడా ప్రధాన బలహీనత

 

చివరి మాటగా

 

సిల్లీ సన్నివేశాలు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ కి తోడు ఆకట్టుకొని కథనంతో సాగే వర్జిన్ భానుప్రియ ఏమాత్రం ఆకట్టుకోదు. ఒక్క ఊర్వశి రాతెలా నటన, గ్లామర్ మినహాయిస్తే చెప్పుకోవడానికి ఏమీ లేదు.

Rating: 1/5

సంబంధిత సమాచారం

తాజా వార్తలు