లాక్ డౌన్ రివ్యూ: యువర్ హానర్- హిందీ వెబ్ సిరీస్(సోనీ లివ్)

తారాగణం: జిమ్మీ షేర్‌గిల్, మీతా వశిష్ట్, యశ్‌పాల్ శర్మ, పారుల్ గులాటి, పుల్కిత్ మాకోల్

దర్శకత్వం: ఇ. నివాస్

సంగీతం: కారెల్ ఆంటోనాన్

లాక్ డౌన్ రివ్యూ సిరీస్ లో భాగంగా నేడు హిందీ వెబ్ సిరీస్ యువర్ హానర్ ని ఎంచుకోవడం జరిగింది. క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఇన్వెస్టిగేటివ్ డ్రామా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం..

 

కథాంశం ఏమిటీ?

 

లూథియానా ప్రాంతానికి చెందిన బిషన్ కోష్లా(జిమ్మీ షెర్గిల్) నిజాయితీ పరుడైన జడ్జి. ఐతే ఓ రోజు తన కొడుకు అబీల్(పుల్కిట్ మాకోల్) హిట్ అండ్ రన్ నేరంలో ఇరుక్కుంటాడు. న్యాయానికి విలువ ఇచ్చే జడ్జి అయిన బిషన్ తన కొడుకు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? తన కొడుకు కాబట్టి న్యాయం కళ్లుగప్పి కొడుకును కాపాడుకున్నాడా? సిన్సియర్ జడ్జిగా అతన్ని పోలీసులకు అప్పగించాడా? అనేది మిగతా కథ ..

 

ఏమి బాగుంది?

 

జడ్జిగా సిరీస్ కి ప్రధాన పాత్ర చేసిన జిమ్మీ షెర్గిల్ నటన ఈ సిరీస్ కి ప్రధాన ఆకర్షణ. రెండు భిన్న షేడ్స్ ఉన్న పాత్రలో ఆకట్టుకున్నారు. ఈ సిరీస్ లో ఆయనది వన్ మాన్ షో కాగా అతని నటన ఆద్యంతం ఆకట్టుకొనేలా సాగింది.

ఇక కీలక పాత్రలు చేసిన నటుల యాక్టింగ్ ఆకట్టుకుంది. చట్టం గురించి తెలిసిన వారు నేరానికి పాల్పడితే వ్యవస్థలను ఎలా వాడుకుంటారు, సాక్ష్యాలను ఎలా తారుమారు చేస్తారు వంటి విషయాలు చక్కగా చూపించారు. మొదటి ఎపిసోడ్స్ అలాగే ముగింపు కూడా బాగుంది.

 

ఏమి బాగోలేదు?

 

అధ్బుతమైన ఆరంభం తరువాత వేగం లోపించిన మధ్య ఎపిసోడ్స్ కొంచెం ఇబ్బంది పడతాయి. ఇక చట్టాన్ని చేతిలోకి తీసుకొనే జడ్జి వ్యవహారం ఓ వర్గానికి నచ్చకపోవచ్చు. కొన్ని సన్నివేశాలలో లాజిక్ మిస్సయ్యింది.

 

చివరి మాటగా

 

అలరించే ఎమోషన్స్..ఆసక్తిగా సాగే ఇన్వెస్టింగేషన్ సన్నివేశాలతో ఈ సిరీస్ ఆద్యంతం అలరిస్తుంది. కొంచెం నెమ్మదించిన మధ్య ఎపిసోడ్స్ ని మినహాయిస్తే ఈ సిరీస్ మంచి అనుభూతిని ఇస్తుంది అనడంలో సందేహం లేదు.

Rating: 3.5/5

సంబంధిత సమాచారం :

More