ఘనంగా ప్రారంభమైన మేఘాంశ్ శ్రీహరి ‘ఆస్మాన్’

ఘనంగా ప్రారంభమైన మేఘాంశ్ శ్రీహరి ‘ఆస్మాన్’

Published on Apr 4, 2026 2:00 PM IST

ega

మేఘాంశ్ శ్రీహరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆస్మాన్’ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. శ్రీ క్లింకార సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా కొండారు వెంకటేష్, శ్రీకాంత్ మన్నెం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రామ్ నందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం శనివారం నాడు ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి సాయి దుర్గ తేజ్, సందీప్ కిషన్, విశ్వక్ సేన్, నిహారిక కొణిదెల, రోషన్ కనకాల, తిరువీర్, నార్నే నితిన్, రామ్ తాళ్లూరి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి సాయి దుర్గ తేజ్ క్లాప్ కొట్టగా, సందీప్ కిషన్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నిహారిక కొణిదెల చిత్ర యూనిట్‌కు స్క్రిప్ట్‌ను అందించారు.

ఈ సందర్భంగా దర్శకుడు రామ్ నందన్ మాట్లాడుతూ.. ఇదొక సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్ అని, కేవలం మూడు షెడ్యూల్స్‌లో సినిమాను పూర్తి చేస్తామని తెలిపారు. నిర్మాతలు వెంకటేష్, శ్రీకాంత్ మాట్లాడుతూ.. కోడి రామకృష్ణ శిష్యుడైన రామ్ నందన్ చెప్పిన కథ మేఘాంశ్‌కు సరిగ్గా సరిపోతుందని, మే నెల నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. అద్భుతమైన కథతో వస్తున్న ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నామని హీరో మేఘాంశ్ శ్రీహరి ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు