ఈ లాజిక్ ప్రకారం డార్లింగ్ సాలిడ్ ప్రాజెక్ట్ ను ఫిక్సయ్యిపోవచ్చా.?

Published on Dec 1, 2020 7:02 am IST

లేటెస్ట్ గా ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబల్ ఫిల్మ్స్ వారి నుంచి వచ్చిన సస్పెన్స్ అప్డేట్ తో ఒక రేంజ్ లో హైప్ ఇప్పుడు మన దక్షిణాదిలో మొదలయ్యింది. ఇక దీనితో ఈ చిత్రం ఏమై ఉంటుందా అన్న ప్రశ్న వచ్చినప్పుడు మరో మాట లేకుండా వినిపించిన పేరు ప్రభాస్. ఇదే నిర్మాణ సంస్థ లో వచ్చిన సెన్సేషనల్ సినిమా కేజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా ఉందని ఎప్పటి నుంచో గట్టిగా వినిపిస్తున్న టాక్.

అయితే ఇప్పుడు వీరు అనౌన్స్ చేసేది ఈ సినిమానే అన్నందుకు ఓ లాజిక్ బాగా కలుస్తుంది. ఇప్పుడు డార్లింగ్ చేపట్టిన సినిమాల్లో ఇంకా టైటిలే ఫిక్స్ కాని చిత్రం నాగశ్విన్ తో ఉంది. దానినే ప్రభాస్ 21 అని అంతా ఫిక్సయ్యారు. కానీ మేకర్స్ నుంచి మాత్రం ఎలాంటి అది ప్రభాస్ 21వ సినిమానే అని ఎప్పుడూ కూడా వార్త రాలేదు మాట కూడా వినిపించలేదు.

అంటే దాని కన్నా ముందే ప్రభాస్ మరో సినిమా చేయడం ఫిక్స్ అయ్యింది.మరి అలాగే ఈ నిర్మాణ సంస్థ కూడా పాన్ ఇండియన్ సినిమా అని చెప్తుండడం అలాగే కొన్నాళ్ల నుంచి ప్రశాంత్ నీల్ అండ్ ప్రభాస్ నుంచి ఓ సినిమా ఉంటుంది అని టాక్ కూడా రావడంతో ప్రభాస్ 21వ సినిమా ఇదే అని చెప్పడానికి దారులు కనిపిస్తున్నాయి. సో ఆ లాజిక్ ప్రకారం ప్రభాస్ చేసే ఈ సాలిడ్ ప్రాజెక్ట్ ఇదే అని చెప్పొచ్చు. మరి ఈ 2న మేకర్స్ అనౌన్స్ చేసేది ఈ సాలిడ్ కాంబోనేనా లేక మరేమన్నానా అనేది చూడాలి.

సంబంధిత సమాచారం :

More