మన సౌత్ సినిమా దగ్గర తన సినిమాలతో ఆడియెన్స్ కి ఒక మ్యాడ్ ఎక్స్ పీరియన్స్ ని అందించిన దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది డెఫినెట్ గా కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ అని చెప్పవచ్చు. తన ఖైదీ, విక్రమ్ సినిమాలు ఇచ్చిన ట్రీట్ అంతా ఇంతా కాదు. అయితే వీటితో పాటుగా తన సినిమాటిక్ యూనివర్స్ కాని సినిమాలపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
ఇలా ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ తో కూలీ అనే భారీ సినిమా చేస్తుండగా ఈ సినిమా తర్వాత ఇండియన్ సినిమా మరో బిగ్ స్టార్ తో సినిమా తను చేయనున్నట్టు తెలుస్తోంది. మరి ఆ హీరో ఎవరో కాదు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ తో అట. ఆల్రెడీ అమీర్ కూలీ సినిమాలో కామియో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక దీనితో పాటుగా సోలోగా కూడా నెక్స్ట్ సినిమా ఉంటుంది అని ఇపుడు టాక్ స్టార్ట్ అయ్యింది. మరి ఈ బిగ్ కాంబినేషన్ పై మరింత క్లారిటీ మున్ముందు రావాల్సి ఉంది.