చరణ్ తో కలయికపై లోకేష్ కనగ్ రాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

Published on Jun 21, 2022 6:28 pm IST

ప్రస్తుతం మన సౌత్ ఇండియన్ సినిమా దగ్గర హాట్ టాపిక్ గా మరీనా మరో దర్శకుడు పేరు లోకేష్ కనగ్ రాజ్. తన సినిమాలకు అంటూ ఒక కొత్త యూనివర్స్ ని సృష్టించి థ్రిల్ చేసిన ఈ మేకర్ నుంచి మరిన్ని సినిమాలు ఎలా ఉంటాయా అని “విక్రమ్” భారీ సక్సెస్ అనంతరం వెయిట్ చేస్తున్నారు.

అయితే ఈ సినిమా అనంతరం లోకేష్ విజయ్ తో ఓ సినిమా చేస్తుండడం ఆల్రెడీ కన్ఫర్మ్ అయ్యింది. అయితే దీనితో పాటుగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కూడా ఓ సినిమా ఉంది అనే టాక్ ఎన్నో నెలల నుంచి వినిపిస్తుంది. అయితే చరణ్ తో కలయికపై లోకేష్ తాజాగా స్పందించినట్టుగా తెలుస్తుంది.

తాను సినిమాపై కోసం అయితే మాట్లాడలేదు కానీ తాను విక్రమ్ రిలీజ్ కి ముందే ఒకట్రెండు చరణ్ ని కలవడం జరిగింది అని చరణ్ నాకు ఒక మంచి ఫ్రెండ్ అని తెలిపాడు. దీనితో ఈ స్టేట్మెంట్ వైరల్ గా మారింది. అయితే ఈ గత మీటింగ్స్ లోనే లోకేష్ చరణ్ కి స్క్రిప్ట్ నరేట్ చేసాడని కూడా టాక్. మొత్తానికి అయితే ఈ క్రేజీ కాంబో కోసం మాత్రం ఆడియెన్స్ గట్టిగానే ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :