
సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన జగదీష్ తలసిల దర్శకుడిగా పరిచయం అవుతూ చేసిన సినిమా ‘లచ్చిందేవికీ ఓ లెక్కుంది’. ‘అందాల రాక్షసి’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న సూపర్ పెయిర్ నవీన్ చంద్ర – లావణ్య త్రిపాటి మరోసారి జంటగా నటించిన ఈ సినిమాని మయుఖ క్రియేషన్స్ బ్యానర్ పై సాయి ప్రసాద్ కామినేని నిర్మించారు. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ లోగోని ఇటీవలే ఎంఎం కీరవాణి లాంచ్ చేసారు.
ఎంఎం కీరవాణి అందించిన ఈ సినిమా ఆడియోని అక్టోబర్ మొదట్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారని ఇది వరకే తెలియజేశాం. తాజాగా ఈ చిత్ర టీం ఆడియో రిలీజ్ కి ముహూర్తం ఫిక్ చేసింది. అక్టోబర్ 11న ఈ సినిమా ఆడియో హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో జరగనుంది. ఈ ఆడియో లాంచ్ కి తన శిష్యుడికి ఆల్ ది బెస్ట్ చెప్పడం కోసం మన జక్కన్న అలియాస్ ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిధిగా హాజరు కానున్నాడు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమా చాలా కామెడీగా ఉంటుంది అనే విషయాన్ని చెప్పకనే తెలియజేస్తోంది. జయప్రకాశ్ రెడ్డి, బ్రహ్మాజీ, అజయ్, సంపూర్నేష్ బాబులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కి ఈశ్వర్ ఎల్లుమహంతి సినిమాటోగ్రాఫర్ గా పనిచేసాడు.

