అందరికీ నచ్చే కమర్షియల్ సినిమానే ‘లోల్’

అందరికీ నచ్చే కమర్షియల్ సినిమానే ‘లోల్’

Published on Dec 11, 2015 2:00 PM IST

lol
‘మగధీర’, ‘మర్యాద రామన్న’, ‘ఈగ’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన జగదీష్ తలసిల దర్శకుడిగా మారి చేసిన సినిమా ‘లచ్చిందేవికీ ఓ లెక్కుంది’ అలియాస్ ‘లోల్’. ‘అందాల రాక్షసి’ గుర్తింపు తెచ్చుకున్న క్రేజీ పెయిర్ నవీన్ చంద్ర – లావణ్య త్రిపాటి మరోసారి జంటగా నటించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని 2016 కానుకగా జనవరి 1న రిలీజ్ కావడానికి సిద్దమైంది.

తాజాగా ఈ సినిమా గురించి మాట్లాడిన డైరెక్టర్ జగదీశ్ మూవీ ఎలా ఉండబూతుంది అనే విషయాన్ని చెప్పాడు. ‘లచ్చిందేవికీ ఓ లెక్కుంది అనే సినిమా స్టార్ట్ టు ఎండ్ ప్రేక్షకులను బాగా నవ్విస్తుంది. పక్కా కమర్షియల్ మూవీ. అన్ని రకాల సినీ అభిమానుల్ని మెప్పించే సినిమా అవుతుంది. ముఖ్యంగా నవీన్ చంద్ర – లావణ్యల కామెడీ ఆడియన్స్ కి స్పెషల్ ట్రీట్ అని’ జగదీశ్ చెప్పాడు. ఇటీవలే రిలీజ్ అయిన ఎంఎం కీరవాణి మ్యూజిక్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. మయుఖ క్రియేషన్స్ బ్యానర్ పై సాయి ప్రసాద్ కామినేని నిర్మించారు. జయప్రకాశ్ రెడ్డి, బ్రహ్మాజీ, అజయ్, సంపూర్నేష్ బాబులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కి ఈశ్వర్ ఎల్లుమహంతి సినిమాటోగ్రాఫర్ గా పనిచేసాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు