కోన వెంకట్ ఋణం తీర్చుకున్న ‘లౌక్యం’ నిర్మాత.

కోన వెంకట్ ఋణం తీర్చుకున్న ‘లౌక్యం’ నిర్మాత.

Published on Oct 3, 2014 12:54 AM IST

kona-venkat
‘మేము పనిచేసిన సినిమాలు హిట్ ఐతే కనీసం బుట్ట ఆపిల్స్ కూడా ఏ నిర్మాత ఇవ్వలేదు కానీ మా ‘లౌక్యం’ నిర్మాత గారు ఏకంగా ఒక ఆపిల్ ఫోనే గిఫ్ట్ ఇచ్చారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ వి.ఆనంద్ ప్రసాద్ గారికి థాంక్స్. మీకోసం పనిచేస్తున్న వారిని ఇలానే ప్రోత్సహిస్తూ ఉండండి. వారు బెస్ట్ అవుట్ పుట్ ఇస్తారు ‘ అంటూ సోషల్ మీడియాలో తన సంతోషాన్ని వ్యక్తం చేశారు ప్రముఖ రచయిత కోన వెంకట్.

గోపీచంద్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 26న విడుదలై మంచి స్పందన సొంతం చేసుకుంది. శ్రీధర్ సీపాన కథ, మాటలు అందించిన ఈ సినిమాకు గోపి మోహన్ – కోన వెంకట్ ద్వయం స్క్రీన్ ప్లే సమకూర్చారు. రొటీన్ కథకు కొంత వైవిధ్యమైన స్క్రీన్ ప్లే అందించారని పేరొచ్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు