లాక్ డౌన్ రివ్యూ: లవ్ ఆజ్ కల్ హిందీ చిత్రం (నెట్ ఫిక్స్)

లాక్ డౌన్ రివ్యూ: లవ్ ఆజ్ కల్ హిందీ చిత్రం (నెట్ ఫిక్స్)

Published on May 5, 2020 3:18 PM IST

నటీనటులు : కార్తీక్ ఆర్యన్, సారా అలీ ఖాన్, రణదీప్ హుడా, అరుషి శర్మ

దర్శకుడు :   ఇంతియాజ్ అలీ

నిర్మాతలు : దినేష్ విజన్

ఛాయాగ్రాహకుడు :  అమిత్ రాయ్

 

లాక్ డౌన్ సిరీస్ లో మన నెక్స్ట్ రివ్యూ లవ్ ఆజ్ కల్. దర్శకుడు ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో 2010లో వచ్చిన చిత్రానికి ఆయన దర్శకత్వంలోనే కార్తీక్ ఆర్యన్, సారా అలీఖాన్, ఆరుషి శర్మ హీరో హీరోయిన్స్ గా తెరకెక్కించారు. నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉన్న ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం..

 

కథాంశం ఏమిటీ?

రెండు భిన్న కాలాలలో నడిచే రెండు ప్రేమ కథల సమాహారం ఈ మూవీ. ప్రస్తుత కాలంలో వీర్(కార్తీక్ ఆర్యన్) మరియు జో(సారా అలీ ఖాన్) ప్రేమ కథ నడుస్తుంది. ఓ సందర్భంలో జో ని కలుసుకున్న వీర్ ఆమెనే తన బెటర్ హాఫ్ గా భావిస్తాడు. ఐతే కాలం గడిచే కొద్దీ, వీరిద్దరి ప్రేమకథలో జో కారణంగా సమస్యలు మొదలవుతాయి. అదే విధంగా 1990లో రఘు(కార్తీక్ ఆర్యన్) లీనా(ఆరుషి శర్మ) టీనేజ్ లవ్ కి పెద్దల వలన అనేక సమస్యలు ఏర్పడతాయి. రెండు కాలాలో నడిచే రెండు జంటల ప్రేమ కథలు చివరికి ఎలా ముగిశాయి అనేది మిగతా కథ.

 

ఏమి బాగుంది?

రెండు భిన్న కాలాలలో వైవిధ్యమైన మనస్తత్వాలు కలిగిన యువ ప్రేమికుడిగా కార్తీక్ ఆర్యన్ నటన ఆకట్టుకుంటుంది. రెండు పాత్రలలో వేరియేషన్స్ చూపిస్తూ నటించిన తీరు బాగుంది. పీరియడ్ లవ్ స్టోరీలో హీరోయిన్ గా కనిపించిన ఆరుషి నటన బాగుంది. ఇక ఇద్దరు హీరోయిన్స్ తో వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు ఆహ్లాదం కలిగిస్తాయి. బీజీఎమ్ బాగుంది అలాగే రెండు మూడు సాంగ్స్ వినడానికి కూడా చాల బాగున్నాయి. కార్తీక ఆర్యన్, సారా అలీ ఖాన్ మధ్య వచ్చే డైలాగ్స్ ప్రస్తుత పరిస్థితులను ప్రతిబింబించేవిగా ఉన్నాయి.

 

ఏమి బాగోలేదు?

ఈ సినిమా రీమేక్ ఆలోచన డైరెక్టర్ ఇంతియాజ్ అలీ ఎందుకు చేశాడో తెలియని పరిస్థితి. ఆయన ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు ప్రేక్షకుడికి అనుభూతిని పంచలేక పోయింది. సారా అలీఖాన్ రోల్ ఈ సినిమాకు పెద్ద మైనస్. ఆమె నటన మరియు పాత్ర తీరు, ఆ ప్రేమ కథకు సింక్ కాలేదు. ఆమె యాక్టింగ్ మరియు ఎమోషన్స్ ఫోర్స్డ్ అనిపిస్తాయి. అలాగే కార్తీక్ ఆర్యన్ తో ఆమె రొమాన్స్ కూడా ఆర్టిఫిషల్ గా ఉంది. ప్రెడిక్టబుల్ నరేషన్ తో స్లో గా సాగే కథనం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది.

 

చివరి మాటగా

ఒకప్పటి హిట్ మూవీగా రీమేక్ గా వచ్చిన లవ్ ఆజ్ కల్ అంచనాలు అందుకోలేకపోయింది. ఎటువంటి మలుపులు లేకుండా మెల్లగా సాగే కథనం, తెరపై ఎమోషన్స్ పండక పోవడం ప్రధాన బలహీనతగా మారింది. సాంగ్స్, డైలాగ్స్ అలాగే కొన్ని రొమాంటిక్ సీన్స్ ఈ మూవీలో కొంచెం ఆకట్టుకొనే అంశాలు.

123telugu.com Rating : 2/5

సంబంధిత సమాచారం

తాజా వార్తలు