యాంకర్ ప్రదీప్‌కి ఐలవ్యూ చెప్పిన అతిలోకసుందరి..!

Published on Jul 7, 2021 1:18 am IST


బుల్లి తెరపై ఎన్నో కార్యక్రమాలకు తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ తెలుగు ప్రేక్షకుల మనసులో యమక్రేజ్ తెచ్చుకున్న యాంకర్ ప్రదీప్ మాచిరాజుకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కాసింత ఎక్కువగానే ఉందని చెప్పాలి. చాలా మంది అమ్మాయిలు ప్రదీప్ అంటే పడి చచ్చిపోతుంటారు. అయితే తాజాగా ప్రదీప్‌కి ఓ అతిలోకసుందరి వచ్చి ఐ లవ్ యూ చెప్పింది.

నిజమా.. ఇంతకీ ఆ అతిలోక సుందరి ఎవరు అనేగా మీరు ఆలోచిస్తున్నారు? అయితే ఇదంతా నిజం కాదు, ఆమె అతిలోకసుందరి కాదు. జీ తెలుగులో ప్రదీప్ యాంకరింగ్ చేస్తున్న డ్రామా జూనియర్స్‌కి యాంకర్ శ్రీముఖి వచ్చింది. ఇందులో భాగంగానే ప్రదీప్‌ నీకు ఓ విష్యం చెప్పలనుకుంటున్న అని శ్రీముఖి అనగా, ఏం చెప్పలనుకుంటున్నావు అని ప్రదీప్ అడిగాడు. అయితే శ్రీముఖి చున్ని అడ్డుగా పెట్టుకుని ఐలవ్యూ అని చెప్పేసింది. అలా శ్రీముఖి ఆ మాట చెప్పగానే ప్రదీప్ చాలా సిగ్గుపడ్డాడు. అయితే ప్రదీప్-శ్రీముఖి మధ్య జరిగిన ఈ రొమాంటిక్ లవ్ ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది, ఆ రోజు ఇందులో పిల్లలు ఎలా ఎంటర్‌టైన్ చేయబోతున్నారనేది మిస్ కాకుడదంటే ఈ ఆదివారం రాత్రి 8:00 గంటలకు జీతెలుగు ఛానల్‌లో వచ్చే డ్రామా జూనియర్స్‌ని పెట్టుకు కూర్చోవాల్సిందే.

సంబంధిత సమాచారం :