టాప్ హీరోల అనుకరణతో మెప్పిస్తోన్న ‘లవ్‌స్టార్’!

love-star
యానిమేషన్ రంగంలో ఎప్పటికప్పుడు వినూత్న టెక్నాలజీలను అందిపుచ్చుకుంటూ సరికొత్త వీడియోలను పరిచయం చేస్తూ వస్తోన్న ‘7 సీస్ ఎంటర్‌టైన్‌మెంట్’ సంస్థ, తాజాగా ‘లవ్‍స్టార్’ పేరుతో మరో వినూత్న కాన్సెప్ట్‌తో ఓ యానిమేటెడ్ సాంగ్‌ను మన ముందుకు తెచ్చింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 17మంది టాప్ హీరోలను ఇమిటేట్ చేస్తూ రూపొందించిన ఈ వీడియోకు సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ వీడియో లక్షా 50 వేల పై చిలుకు వ్యూస్ సాధించి దూసుకుపోతోంది.

బూరుగుపల్లి సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన ఈ యానిమేటెడ్ వీడియోకు నరేష్ రావుల సంగీతం సమకూర్చారు. హేమ చంద్ర, శ్రావణి భార్గవిల గాత్రానికి నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా టాప్ హీరోల ఇమిటేషన్‌కు తగ్గట్టుగా వీరిద్దరూ ఈ పాటను పాడిన విధానానికి మంచి మార్కులు పడ్డాయి. యానిమేషన్ రంగంలో తమదంటూ ఓ మార్క్ సెట్ చేసుకోవాలి చేసిన ఈ ప్రయత్నానికి ఈ స్థాయి రెస్పాన్స్ రావడం పట్ల ‘7 సీస్ ఎంటర్‌టైన్‌మెంట్’ సంస్థ ఆనందం వ్యక్తం చేసింది. తమ టార్గెట్ అయిన పిల్లలను ఈ వీడియో బాగా అలరించిందని వారు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

‘లవ్‌స్టార్’ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version