రిలీజ్ రోజే మరో మైల్ స్టోన్ కొట్టిన ‘లవ్ స్టోరీ’ సెన్సేషనల్ సాంగ్!

Published on Sep 24, 2021 10:00 am IST


ఎన్నో అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ఆడియెన్స్ అంతా కూడా ఎదురు చూస్తున్న మోస్ట్ అవాయిడ్ చిత్రం “లవ్ స్టోరీ”. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య మరియు సాయిపల్లవి లు హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం నేడు రిలీజ్ అవుతుంది. మరి అన్ని చోట్లా కూడా సాలిడ్ బుకింగ్స్ తో ఈ వారాంతం వరకు బిజీగా ఉన్న ఈ చిత్రం రిలీజ్ రోజే మరో మైల్ స్టోన్ ఈ సినిమా ఖాతాలో పడింది.

ఈ సినిమాకి ఇంత బజ్ రావడానికి కారణం ఈ కాంబినేషన్ అయితే మరో కారణం పవన్ సి హెచ్ ఇచ్చిన సంగీతం అని కూడా చెప్పి తీరాలి. తాను ఇచ్చిన అన్ని పాటలు కూడా మంచి చార్ట్ బస్టర్స్ అయ్యాయి. మరి వాటిలో లిరికల్ వీడియో సారంగదరియా సెన్సేషన్ అయితే చెప్పక్కర్లేదు..

ఎన్నో ఫాస్టెస్ట్ రికార్డ్స్ ని అది బద్దలుకొట్టి సెట్ చేసింది. మరి ఇప్పుడు ఈ సాంగ్ సినిమా రిలీజ్ ఈరోజుకి 325 మిలియన్ వ్యూస్ మార్క్ ని క్రాస్ చేసి మరో ఫాస్టెస్ట్ రికార్డు అందుకుంది. రిలీజ్ రోజే ఇలా ఈ మార్క్ అందుకోవడం విశేషమే అని చెప్పాలి. ఇక ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి వారు మరియు అమిగోస్ క్రియేషన్స్ వారు నిర్మాణ వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :