“లవ్ స్టొరీ” సినిమా థియేటర్ల లోనే!

Published on Jul 7, 2021 11:09 pm IST

ఫీల్ గుడ్ చిత్రాలను తెరకెక్కించడం లో శేఖర్ కమ్ముల స్థానం వేరే లెవెల్ అని చెప్పాలి. అయితే అక్కినేని నాగ చైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం లవ్ స్టొరీ. ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల పై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే తాజాగా ఈ చిత్ర నిర్మాత అయిన నారాయణ్ దాస్ కే నారంగ్ ఈ చిత్రం విడుదల పై ఒక క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

లవ్ స్టొరీ సినిమా కోసం కొన్ని ఓటిటి లు భారీ ఆఫర్లతో ముందుకు వచ్చాయి అని వివరించారు. అయితే థియేటర్ల లో లోనే ముందుగా రిలీజ్ చేస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే అమిగోస్ క్రియేషన్స్ మరియు శ్రీ వెంకటేశ్వర సినిమాస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఏషియన్ సినిమాస్ ఈ చిత్రానికి డిస్ట్రిబ్యూషన్ గా వ్యవహరిస్తున్నాయి. ఈ చిత్రానికి సంగీతం పవన్ సిహెచ్ అందించారు. ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా థియేటర్లలోకి తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :