“లవ్ స్టొరీ” రిలీజ్ అప్పుడికి వాయిదా పడిందా?

Published on Aug 31, 2021 7:06 am IST


అక్కినేని యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా నాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా మ్యాజికల్ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “లవ్ స్టోరీ”. ఎప్పుడు నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ఇది. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం ఎట్టకేలకు వచ్చే సెప్టెంబర్ 10కి ఫైనల్ చెయ్యగా సరిగ్గా అదే తేదీకి మరిన్ని సినిమాలు లాక్ చెయ్యడం తో ఈ చిత్రం కొత్త డేట్ కి షిఫ్ట్ అయ్యినట్టుగా గట్టి టాక్ వినిపిస్తుంది.

మరి ఇప్పుడు ఈ చిత్రం వచ్చే సెప్టెంబర్ నెలాఖరుకు షిఫ్ట్ అయ్యినట్టుగా లేటెస్ట్ బజ్ సినీ వర్గాల్లో వినిపిస్తుంది. దాని ప్రకారం అయితే ఈ చిత్రం సెప్టెంబర్ 24న కానీ 30 న కానీ రిలీజ్ అవ్వనున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై మరోసారి అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి పవన్ సి హెచ్ సంగీతం అందివ్వగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :