నాగ చైతన్య ప్రేమ కథ ఏంటో తెలిసేది అప్పుడే

Published on Jan 25, 2021 10:00 pm IST

అక్కినేని యువ హీరో నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘లవ్ స్టోరీ’ అనేది ఈ సినిమా టైటిల్. ‘మజిలీ, వెంకీ మామ’ లాంటి విజయాల తర్వాత చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ప్రేక్షకుల్లో చాలా అంచనాలే ఉన్నాయి. పైగా ‘ఫిదా’లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న ప్రాజెక్ట్ కావడం అంచనాలను మరింత పెంచింది. ఇప్పటికే విడుదలైన టీజర్ సైతం ఆకట్టుకుంది. చైతూ, సాయి పల్లవి జోడీకి మంచి అప్లాజ్ వచ్చింది.

షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండటంతో రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు నిర్మాతలు. సినిమా ఏప్రిల్ 16న విడుదలకానుంది.తమ కలల్ని నిజం చేసుకోవడం కోసం హైదరాబాద్ వచ్చిన యువతీయువకుల కథగా ఈ చిత్రం ఉండనుంది. నారాయణ్ దాస్ కె నారంగ్, రామ్మోహన్ రావ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య వర్క్ చేయడం ఇదే మొదటిసారి కాబట్టి సినిమా ఫ్రెష్ అండ్ ఫీల్ గుడ్ మూవీలా ఉంటుందని ప్రేక్షకులు, అభిమానులు ఆశిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More