రాజ్ తరుణ్ ‘లవర్’ బాగా నవ్విస్తుందట !

Published on Jul 1, 2018 8:09 pm IST


‘ఉయ్యాల జంపాలా’ చిత్రంతో తెలుగు తెరకు హీరోగా పరిచయమైన రాజ్ తరుణ్ సినిమా చూపిస్తా మావ, కుమారి 21f చిత్రాలతో మంచి విజయాలనే అందుకున్నాడు. కానీ ప్రస్తుతం రాజ్ తరుణ్ వరుస పరాజయాలతో గత కొంతకాలంగా ఇబ్బందిపడుతున్నాడు. రాజ్ తరుణ్ కెరీర్ కి తాను తాజాగా నటించిన ‘లవర్’ చిత్రం చాలా కీలకం కానుంది. ‘అలా ఎలా’ చిత్రంతో పరిచయమైన యువ దర్శకుడు అన్నీష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ‘లవర్’ చిత్రం మంచి ఎంటర్టైనింగా ఉండనుందని సమాచారం.

కాగా అన్నీష్ కృష్ణ మొదటిచిత్రం ‘అలా ఎలా’ చిత్రం కూడా హాస్యభరితంగానే సాగుతుంది. అదేవిధంగా లవర్ చిత్రాన్ని కూడా అనీల్ మంచి ఎంటర్టైనింగా మలిచాడని ఇందులోని సన్నివేశాలు బాగా నవ్విస్తాయట. మరి రాజ్ తరుణ్ కి ఈ చిత్రమైన విజయాన్ని అందిస్తుందేమో చూడాలి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమక్షంలో శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ఫై హర్షిత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :