న్యాచురల్‌గా వరుణ్ “ఇందువదన” లిరికల్ వీడియో..!

Published on Jul 6, 2021 2:40 am IST

బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత హీరో వరుణ్ సందేశ్ చేస్తున్న తొలి చిత్రం “ఇందువదన”.
ఫర్నాజ్‌ శెట్టి కథానాయికగా ఎంఎస్ఆర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మాధవి ఆదుర్తి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో అటవీ శాఖ అధికారిగా వరుణ్, గిరిజన యువతిగా ఫర్నాజ్ శెట్టి కనిపించబోతున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు, వరుణ్ మేకోవర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. a

అయితే తాజాగా ఈ సినిమా నుంచి ‘వడివడిగా సుడిగాలిలా వచ్చి.. గుచ్చి గుచ్చి చూస్తావు భలే భలేగా’ అంటూ ఓ లిరికల్ వీడియో సాంగ్‌ రిలీజ్‌ అయ్యింది. జావేద్ అలీ, మాళవిక ఆలపించిన ఈ పాటకు, తిరుపతి జావన లిరిక్స్ ఇవ్వగా, శివ కాకాని సంగీతాన్ని అందించారు. అయితే చక్కటి న్యాచురాలిటి పాటలను కోరుకునే వారెవరైనా ఈ పాటను తప్పక వినాల్సిందే. ఇదిలా ఉంటే ఇటీవల షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

సంబంధిత సమాచారం :