“ఆర్ఆర్ఆర్” కోసం అనిరుధ్ తో ముగిసిన కీరవాణి చర్చ…ఏమన్నారంటే?

Published on Jul 25, 2021 10:51 pm IST


దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌద్రం రణం రుధిరం చిత్రం ప్రమోషన్స్ విషయం లో చిత్ర యూనిట్ వేగంగా అడుగులు వేస్తుంది. అన్ని పక్కా ప్రణాళిక తో దూసుకు పోతుంది. అయితే ఈ చిత్రం ప్రమోషనల్ సాంగ్ కోసం దర్శకుడు ఎం ఎం కీరవాణి ఇతర భాషలకు చెందిన సంగీత దర్శకులతో చర్చలు జరుపుతున్నారు. అయితే తాజాగా యువ సెన్సేషన్ అనిరుద్ రవి చందర్ తో ఎం ఎం కీరవాణి చర్చ జరిగింది. అయితే ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

అయితే అనిరుద్ పై ఈ మేరకు కీరవాణి ప్రశంసల వర్షం కురిపించారు.అనిరుద్ తో గొప్ప సెషన్ పూర్తి అయింది అని, సమర్థత, శక్తి, ప్రతిభ, మరియు అద్భుతమైన సహచరుల బృందం ఆయన ప్రధాన ఆస్తులు అంటూ చెప్పుకొచ్చారు. అన్నిటికంటే ముఖ్యంగా డౌన్ టు ఎర్త్ ఉంటారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఒక అగ్ర సంగీత దర్శకుడు అనిరుద్ పై పొగడ్తల వర్షం కురిపించడం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అనిరుధ తమిళ వెర్షన్ లో ప్రమోషనల్ సాంగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :