సీనియర్ నటి కవితకు మా సభ్యుల పరామర్శ..!

Published on Jul 3, 2021 11:59 pm IST

ఎక్కడినుంచి వచ్చిందో ఈ మాయదారి కరోనా తెలీదు కానీ ఎంతో మంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంటూ ఎన్నో కుటుంబాల ఉసురు పోసుకుంటుంది. సినీ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంది ప్రముఖులను బలి తీసుకున్న ఈ మహమ్మారి తాజాగా సీనియర్ నటి కవిత ఇంట్లో కూడా తీర్చలేని విషాదాన్ని నింపింది. కవిత భర్త దశరథ రాజు ఇటీవల కరోనాతో కన్నుమూశారు. అయితే కవిత భర్త చనిపోయేకంటే 20 రోజుల ముందు ఆమె కుమారుడు కూడా మరణించాడు.

అయితే కొడుకు మరణం మరిచిపోకముందే భర్త కూడా చనిపోవడంతో కవిత తీవ్ర దుఖ: సాగరంలోకి వెళ్ళింది. ఈ క్రమంలో చాలా మంది సినీ ప్రముఖులు ఆమెకు ధైర్యం చెబుతూ ఓదారుస్తున్నారు. తాజాగా మా అధ్యక్షుడు నరేష్‌తో పాటు కరాటే కళ్యాణి మరికొందరు మా సభ్యులు కవిత ఇంటికి వెళ్లి ఆమెకు ధైర్యం చెప్పి ఓదర్చారు. తామ అండగా ఉంటామని, ఎలాంటి సాయం కావాలన్నా తమని అడగాలని ఆమెకు వారు భరోసా ఇచ్చారు.

సంబంధిత సమాచారం :