స్టార్ బ్యూటీ సమంత మెయిన్ లీడ్‌లో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మా ఇంటి బంగారం’ విడుదలకు ముస్తాబవుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ మిక్సింగ్ శరవేగంగా జరుగుతోంది. టెక్నికల్ పనులన్నీ పూర్తి చేసుకుని ప్రేక్షకులను అలరించేందుకు ఈ చిత్రం సిద్ధంగా ఉంది.
ట్రలాలా పిక్చర్స్ పతాకంపై రాజ్ అండ్ డీకే సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ జూన్ 19, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ సినిమాలో గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే, గౌతమి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. సమంత, నందిని రెడ్డి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘ఓ బేబీ’ సూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమాపై మరింత పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.


