సెన్సేషనల్ రిపబ్లిక్ డే సాంగ్ తో మాదాల రవి !

Published on Jan 26, 2020 4:06 pm IST

భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజున (జనవరి 26న) భారతదేశమంతా ఘనంగా ప్రతి సంవత్సరం భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ రోజు దేశమంతా ఈ రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొంది. ప్రముఖులు కూడా తమ శైలిలో గణతంత్ర దినోత్సవ గొప్పతనాన్ని తెలిపారు. అలాగే ప్రముఖ నటుడు మాదాల రవి కూడా ఓ దేశభక్తి సాంగ్ తో రిపబ్లిక్ డే రోజున ప్రేక్షుకుల ముందుకు వచ్చారు.

మాదాల రవి నటించిన ఈ గణతంత్ర దినోత్సవ పాటను చైతన్య ప్రసాద్ దేశ భక్తి గురించి గొప్పగా ఆవిష్కరిస్తూనే పాటను సహజమైన పదాలతో అర్ధంవంతమైన భావాలతో చక్కగా రాశారు. ముఖ్యంగా మనకు స్వాతంత్య్రం ఎందుకు వచ్చిందనే కోణంలోని పరిస్థుతులతో పాటు… 70 సంవత్సరాల తరువాత కూడా మన దేశంలో దేశ కార్మికవర్గం, పేదలు, అణగారిన రైతులు తమ ఉనికి కోసం ఎలా బాధపడుతున్నారో కూడా ఈ పాటలో చక్కగా ప్రస్తావించారు.

మొత్తానికి ఈ పాట కేవలం గణతంత్ర దినోత్సవం పాటగానే కాకుండా నిజమైన స్వాతంత్ర్యం యొక్క నిజమైన అర్ధం అంటే ఏమిటి.. అసలైన దేశ భక్తి భావోద్వేగం అంటే ఏమిటో చెబుతుంది

సంబంధిత సమాచారం :

X
More