మధు శాలినికి కమల్ తో ఆఫర్ ఇప్పించింది ఎవరో తెలుసా.?

madhu-shalini
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘చీకటి రాజ్యం’. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి షూట్ చేసిన ఈ సినిమాకి తమిళంలో ‘తూంగావనం’ అనే టైటిల్ ని పెట్టారు. షూటింగ్ మొత్తం ఫినిష్ చేసిన ఈ చిత్ర టీం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉంది. ఈ సినిమాలో తెలుగు హాట్ బ్యూటీ అయిన మధు శాలిని కూడా ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. కానీ ఈ అవకాశం తనకి రావడానికి ప్రధాన కారణం యంగ్ హీరోయిన్ ప్రియా ఆనంద్ అని, ఈ ఇచ్నేమా కోసం నన్ను రెకమండ్ చేసిన ప్రియా ఆనంద్ కి స్పెషల్ థాంక్స్ అని మీడియాకి తెలిపింది.

అంతే కాకుండా కమల్ హాసన్ తో నటించాలానే డ్రీం ఈ సినిమాతో నెరవేరినందుకు చాలా ఆనందపడుతూనే కమల్ తో పనిచేసిన అనుభవం మరచిపోలేనిదని అంటోంది. యాక్టింగ్ పరంగా, టేక్నికాలిటీస్ పరంగా కమల్ కి ఉన్న నాలెడ్జ్ సింప్లీ సూపర్బ్ అని మధు శాలిని కితాబులు కూడా ఇస్తోంది. ఈ సినిమాని దీపావళి కానుకగా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. త్రిష, ప్రకాష్ రాజ్ లు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకి జిబ్రాన్ మ్యూజిక్ అందించాడు. రాజేష్ ఎం సెల్వ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి జిబ్రాన్ మ్యూజిక్ అందించాడు.

Exit mobile version