ఆకట్టుకుంటున్న ‘శాకుంతలం’ నుండి ‘మధురగతమా’ సాంగ్

Published on Feb 14, 2023 9:54 pm IST

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ శాకుంతలం. గుణా టీమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంతో భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ మైథలాజికల్ మూవీలో సమంత కి జోడీగా దేవ్ మోహన్ నటిస్తుండగా ఇతర కీలక పాత్రల్లో మోహన్ బాబు, సచిన్ ఖేడేకర్, గౌతమి, అనన్య నాగళ్ళ, ప్రకాష్ రాజ్ వంటి వారు నటిస్తున్నారు. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని దిల్ రాజు సమర్పిస్తుండగా నీలిమ గుణ నిర్మిస్తున్నారు.

ఇక ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్, పోస్టర్స్ అన్ని కూడా ఆడియన్స్ ని ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. ఇక నేడు ఈ మూవీ నుండి మధురగతమా అనే పల్లవితో సాగె మెలోడియస్ సాంగ్ ని రిలీజ్ చేసారు. అర్మాన్ మాలిక్, శ్రేయ ఘోషల్ అద్భుతంగా పాడిన ఈ సాంగ్ కి మణిశర్మ ఆకట్టుకునే ట్యూన్ ని అందించారు. శ్రీమణి సాహిత్యం అందించిన ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్ ని దక్కించుకుంటోంది. కాగా శాకుంతలం మూవీ సమ్మర్ కానుకగా 2023 ఏప్రిల్ 14 న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :