ఓటీటీ సమీక్ష: మా బెహన్ – నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు డబ్బింగ్ చిత్రం

ఓటీటీ సమీక్ష: మా బెహన్ – నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు డబ్బింగ్ చిత్రం

Published on Jun 4, 2026 6:50 PM IST

Maa Behen OTT Movie Review

ఓటీటీ వేదిక : నెట్‌ఫ్లిక్స్
ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ : జూన్ 4, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : మాధురీ దీక్షిత్, త్రిప్తి దిమ్రి, ధర్ణా దుర్గా, రవి కిషన్, అరుణోదయ్ సింగ్ తదితరులు
దర్శకత్వం : సురేష్ త్రివేణి
నిర్మాతలు : విక్రమ్ మల్హోత్రా, సురేష్ త్రివేణి
సంగీతం : ఆకాష్‌దీప్ సేన్‌గుప్తా
ఛాయాగ్రహణం : అనుజ్ రాకేష్ ధవన్
కూర్పు : దీపిక కల్రా

సంబంధిత లింక్స్ : ట్రైలర్

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మాధురి దీక్షిత్, క్రేజీ హీరోయిన్ త్రిప్తి దిమ్రి ముఖ్య పాత్రల్లో నటించిన లేటెస్ట్ క్రైమ్ డార్క్ కామెడీ డ్రామా చిత్రం ‘మా బెహన్’. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో నేటి(జూన్ 4) నుంచి ఈ సినిమా నేరుగా స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

రేఖ (మాధురి దీక్షిత్) ఒక సాధారణ లోయర్ మిడిల్ క్లాస్ హౌస్‌వైఫ్. ఆమెకు ఇద్దరు కూతుళ్లు.. జయ (త్రిప్తి దిమ్రి), సుష్మా (ధర్ణా దుర్గా). అయితే, వీరి ప్రశాంతమైన జీవితంలోకి ఒక ఊహించని పెద్ద సమస్య వచ్చి పడుతుంది. పక్కింట్లో ఉండే ఒక వ్యక్తి వీరి ఇంట్లో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపిస్తాడు. అసలు ఆ వ్యక్తి ఎలా చనిపోయాడు? పోలీసులకు దొరకకుండా, చుట్టుపక్కల వారికి అనుమానం రాకుండా ఆ ముగ్గురు మహిళలు ఆ శవాన్ని ఏం చేశారు? ఈ క్రమంలో వారు ఎదుర్కొన్న విచిత్రమైన పరిస్థితులు ఏంటి? అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ లీడ్ క్యాస్టింగ్ పర్ఫార్మెన్స్. మాధురి దీక్షిత్ తన సీనియారిటీతో రేఖ పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఒకపక్క భయం, ఇంకోపక్క కుటుంబాన్ని కాపాడుకోవాలనే తాపత్రయాన్ని ఆమె బాగా పండించింది. త్రిప్తి దిమ్రి గ్లామర్ పక్కన పెట్టి చాలా డీసెంట్ నటనను కనబరిచింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే ఒక ఎమోషనల్ మోనోలాగ్ సీన్‌లో ఆమె నటన చాలా బాగుంది. ఇక చిన్న కూతురిగా నటించిన ధర్ణా దుర్గా వన్-లైనర్స్ మరియు ఎక్స్‌ప్రెషన్స్‌తో మంచి కామెడీ ట్రాక్ నడిపింది.

ఈ ముగ్గురు యాక్టర్స్ మధ్య వచ్చే ఇల్లాజికల్ గొడవలు, ఫ్యామిలీ డ్రామా సీన్స్ సహజంగా ఉంటూ మంచి ఫన్ జనరేట్ చేశాయి. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా ఫాస్ట్‌గా, ఫన్నీగా సాగుతుంది. ఇంట్లో శవం పడిన తర్వాత ఈ ముగ్గురు మహిళలు పడే కంగారు, ఆ శవాన్ని దాచడానికి చేసే హడావిడి మంచి నవ్వులు పూయిస్తుంది.

దర్శకుడు రాసుకున్న కొన్ని డార్క్ కామెడీ సీన్స్, డైలాగ్స్ పర్ఫెక్ట్‌గా వర్కవుట్ అయ్యాయి. మిగతా నటీనటులు తమ పాత్రల మేర పర్వాలేదనిపించారు.

మైనస్ పాయింట్స్ :

ఫస్ట్ హాఫ్‌లో ఉన్నంత ఫన్ మరియు గ్రిప్పింగ్ నరేషన్ సెకండ్ హాఫ్‌లోకి వచ్చేసరికి లోపించింది. కథ ముందుకు సాగకుండా ఒకే పాయింట్ చుట్టూ తిరుగుతూ కాస్త సాగదీసినట్లు అనిపిస్తుంది.

ఒక డార్క్ కామెడీ థ్రిల్లర్‌కి ఉండాల్సిన గ్రిప్పింగ్ నరేషన్ మిస్ అయింది. క్లైమాక్స్ ట్విస్ట్‌లు చాలా ప్రెడిక్టబుల్‌గా ఉండటం వల్ల మిస్టరీ రివీల్ అయ్యేటప్పుడు పెద్దగా ఇంపాక్ట్ అనిపించదు. క్రైమ్ కామెడీ డ్రామా అయినప్పటికీ, కొన్ని సీన్స్ మరీ సినిమాటిక్‌గా, లాజిక్‌కు దూరంగా అనిపిస్తాయి. పోలీసులు విచారణ చేసే తీరు కూడా చాలా వీక్‌గా డిజైన్ చేశారు.

కథలోని మిగతా పాత్రలను కేవలం నామమాత్రానికి వాడుకున్నారు తప్ప, వాటికి సరైన డెప్త్ లేదు. అలాగే సినిమాలో పాటలు గానీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గానీ అంతగా రిజిస్టర్ అవ్వవు.

సాంకేతిక విభాగం :

దర్శకుడు సురేష్ త్రివేణి ఎంచుకున్న క్రైమ్ కామెడీ లైన్ బాగున్నా, దాన్ని రెండు గంటల పాటు ఆసక్తికరంగా నడపడంలో పూర్తిస్థాయిలో సక్సెస్ అవ్వలేకపోయారు. అనుజ్ రాకేష్ ధావన్ సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఇండోర్ సీన్స్‌ని బాగా క్యాప్చర్ చేశారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్‌ని ఎలివేట్ చేసినా, ఓవరాల్‌గా యావరేజ్ అనిపిస్తుంది. ఎడిటింగ్ విభాగం సెకండ్ హాఫ్‌పై ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు.

తీర్పు :

ఓవరాల్‌గా చూస్తే.. ‘మా బెహన్’ అంటూ వచ్చిన ఈ డార్క్ క్రైమ్ కామెడీ చిత్రం ప్రేక్షకులను కొంతవరకే మెప్పిస్తుంది. మాధురి దీక్షిత్, త్రిప్తి దిమ్రిల పర్ఫార్మెన్స్, ఫస్ట్ హాఫ్‌లో వచ్చే కొన్ని హిలేరియస్ డార్క్ కామెడీ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. సెకండ్ హాఫ్‌లో బలం లేకపోవడం, క్లైమాక్స్‌ను ముందే ఊహించేలా రాసుకోవడం సినిమాకు మైనస్. క్రైమ్ కామెడీ చిత్రాలను ఇష్టపడేవారు ఈ చిత్రాన్ని తక్కువ అంచనాలతో చూడటం బెటర్.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

తాజా వార్తలు