‘మహా సముద్రం’ క్లైమాక్స్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్ !

Published on Jul 25, 2021 10:35 pm IST


శర్వానంద్ – సిద్ధార్ద్ కీలకపాత్రలుగా టాలెంటెడ్ డైరెక్టర్ అజ‌య్ భూప‌తి దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘మహా సముద్రం’. కాగా ఈ సినిమా క్లైమాక్స్ పై ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. క్లైమాక్స్ లో హీరో క్యారెక్టర్ కి సంబంధించి ఎవరూ ఊహించని ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుందని, తెలుస్తోంది.

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. చిన్న తనంలోనే ఒకరి పై ఒకరు ద్వేషం పెంచుకున్న ఇద్దరు ఆవేశపరుల మధ్య జరిగే కథ అని తెలుస్తోంది. శర్వానంద్ – సిద్ధార్ద్ మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ అద్భుతంగా ఉంటాయట. పైగా ఈ చిత్రంలో ఇంట్రెస్టింగ్ ప్రేమకథ కూడా ఉందని.. సినిమాలో హీరోయిన్ పాత్ర చనిపోతుందని.. అలాగే స్టోరీ వరల్డ్ కూడా కాస్త కొత్తగా ఉంటుందని తెలుస్తోంది.
ఇక ఈ సినిమా పక్కా ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా కూడా ఉంటుందట. వైజాగ్ నేపథ్యంలో నడిచే క్రైమ్ థ్రిల్లర్ గా మహాసముద్రం చిత్రం తెరకెక్కనుందని సమాచారం. అలాగే ఈ సినిమా తెలుగు తమిళంలో ఒకేసారి తెరకెక్కనుంది.

సంబంధిత సమాచారం :