‘కన్నప్ప’ నుంచి మహదేవ శాస్త్రి గ్లింప్స్ వచ్చేది ఎప్పుడంటే?

‘కన్నప్ప’ నుంచి మహదేవ శాస్త్రి గ్లింప్స్ వచ్చేది ఎప్పుడంటే?

Published on Mar 18, 2025 12:00 AM IST

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మైథలాజికల్ పాన్ ఇండియా మూవీ ‘కన్నప్ప’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాలో మంచు విష్ణు హీరోగా నటిస్తుండగా ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రెస్టీజియస్ చిత్రంలో భారీ తారాగణం నటిస్తున్నారు. ఇందులో డా.మోహన్ బాబు ‘మహదేవ శాస్త్రి’ అనే పాత్రలో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు సిద్ధమయ్యారు.

ఇక ఈ సినిమాలోని ‘మహదేవ శాస్త్రి’ పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ను మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా మార్చి 19న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఆయన ఇంట్రో సాంగ్ ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 25న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాను డా.మోహన్ బాబు అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు