మహానటికి మరో అరుదైన ఘనత !

Published on May 4, 2019 9:50 am IST

అలనాటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం మహానటి గత ఏడాది మే లో విడుదలై బయోపిక్ చిత్రాల్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. కీర్తి సురేష్ ప్రదాన పాత్రలో నటించిన ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాకుండా పలు అవార్డులను కూడా ఖాతాలో వేసుకుంది. ఇక ఈ చిత్రం తాజాగా మరో రేర్ ఫీట్ ను సొంతం చేసుకుంది. ప్రతిష్టాత్మక షాంగై ఫిలిం ఫెస్టివల్ కు సెలెక్ట్ అయిన ఇండియన్ సినిమాగా ఘనత సాధించింది. చైనాలోని షాంగై లో జూన్ 15నుండి 24 వరకు జరిగే ఈ ఫెస్టివల్ లో మహానటి సినిమా ను ప్రదర్శించనున్నారు.

నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ , సమంత , విజయ్ దేవరకొండలు ముఖ్య పాత్రల్లో నటించారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

సంబంధిత సమాచారం :

More