దర్శకుడు క్రిష్ నటరత్న ఎన్టీఆర్ జీవితకథను తెరకెక్కించబోతున్న విషయం తేలింసిదే. బాలకృష్ణ ప్రధానపాత్రను పోషించడమే కాకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 5 నుంచి షూటింగ్ కి వెళ్లనున్న ఈ చిత్రంలోని ముఖ్యమైన పాత్రల కోసం ఇప్పటికే విద్యాబాలన్ ను, రానాను, సచిన్ కేడెకర్ ను, మోహన్ బాబును ఎంపిక చేశారు. తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం సూపర్ స్టార్ కృష్ణ పాత్రలో మహేష్బాబును, అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో సుమంత్ నటింపజేయనున్నారని వార్తలు వస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం మహానటి పాత్రలో కీర్తి సురేష్ మరోసారి కనిపించనుందట. నందమూరి తారకరామారావుగారి పక్కన మహానటి సావిత్రిగారు చాలా కలిసి సినిమాల్లో నటించారు. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ లో కూడా సావిత్రిగారి పాత్ర ఉంది. ఆ పాత్రను కీర్తి సురేష్ మరోసారి పోషించనుందని సమాచారం.


