చైతన్య యాత్రలో ‘మహానాయకుడు’ !

Published on Jan 22, 2019 11:51 pm IST

క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నిర్మాణంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా తెరకెక్కతున్న ఆయన బయోపిక్ పార్ట్స్ లో సెకెండ్ పార్ట్ మహానాయకుడు ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

ఎన్టీఆర్ హరికృష్ణతో కలిసి చైతన్య రథం పై చైతన్య యాత్ర పేరుతో రాష్ట్రం అంతా పర్యటించిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం బాలకృష్ణ, కళ్యాణ్ రామ్ ల పై చైతన్య యాత్రకు సంబంధించిన ఆ సన్నివేశాలను ప్రస్తుతం క్రిష్ తెరకెక్కిస్తున్నారు. ఈ సన్నివేశాల్లో స్వయంగా ఎన్టీఆర్ ఉయోగించిన చైతన్య రథంనే చూపిస్తున్నారు. అలాగే ఈ సన్నివేశాల్లో వేలాదిమంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనడం విశేషం.

అలాగే తాజా సమాచారం ప్రకారం, ఎన్టీఆర్ మహానాయకుడు మొత్తం షూటింగ్ జనవరి 22వ తేదీకల్లా పూర్తి కానుంది. ఫిబ్రవరి 14వ తేదీన ‘మహానాయకుడు’ విడుదల కానుంది. ఇక మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ జనవరి 9న విడుదలై, పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ ను మాత్రం పెద్దగా రాబట్టుకోలేపోయిన విషయం తెలిసిందే.

సంబంధిత సమాచారం :

X
More