‘మహానాయకుడు’ ఈ రోజు మరింతగా !

Published on Feb 26, 2019 6:55 pm IST

బాక్సాఫీస్ వద్ద ఎన్టీఆర్ ‘మహానాయకుడు’కి కాస్త గట్టిగానే ఎదురుదెబ్బ తగులుతుంది. సినిమాకు మంచి మౌత్ టాక్ ను వచ్చినప్పటికీ.. మొదటి రోజు నుండి తెలుగు రాష్ట్రాల్లో కూడా తన స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టలేకపోతున్నాడు మహానాయకుడు. వీక్ మధ్యలో ఉండటంతో కలెక్షన్స్ మరింతగా పడిపోయాయి. ఈ రోజు మార్నింగ్ మరియు మ్యాట్నీ షోస్ లో 50% కూడా హాల్స్ నిండలేదు.

మొదటి రోజు కేవలం 1.60 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టిగలిగాడు. అలాగే తొలి మూడు రోజులకు గానూ మహానాయకుడు కేవలం 2 కోట్లు మాత్రమే వసూళ్లు చేశాడు. ఈ కలెక్షన్స్ ఇలాగే కొనసాగితే డిస్టిబ్యూటర్స్ కు ఎగ్జిబ్యూటర్స్ కు బాగా నష్టాలు వచ్చే అవకాశం ఉంది.

కాగా కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఎన్ బి కె ఫిలిమ్స్ తో పాటు, వారాహి ప్రొడక్షన్స్ మరియు విబ్రి మీడియా సంయుక్తంగా నిర్మించాయి.

సంబంధిత సమాచారం :