ఓవర్సీస్ లో భారీ స్థాయిలో విడుదలకానున్న మహర్షి !

Published on May 3, 2019 11:00 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 25 వచిత్రం ‘మహర్షి’ ఈనెల 9న విడుదలకు సిద్దమవుతుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం యొక్క ట్రైలర్ పాజిటివ్ రెస్పాన్స్ ను రాబట్టుకుని మంచి బజ్ ను క్రియేట్ చేసింది. ఇక ఈ చిత్రంఓవర్సీస్ లో భారీ స్థాయిలో విడుదలకానుంది. సుమారు ఈచిత్రానికి తొలి రోజు అక్కడ 2500 కు పైగా ప్రీమియర్స్ షో లు పడనున్నాయి. అంతేకాకుండా యూఎస్ లో ఈ రేంజ్ లో విడుదలవుతున్న మొదటి సినిమా కూడా ఇదే కావడం విశేషం. దాంతో ఈ చిత్రం మొదటి రోజు కలెక్షన్ల పరంగా కొత్త రికార్డు ను సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది.

వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా ,అల్లరి నరేశ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. దిల్ రాజు , అశ్వినీ దత్ , పీవీపీ లు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :

More