‘మహర్షి’ నాలుగు రోజుల కలెక్షన్స్ !

‘మహర్షి’ నాలుగు రోజుల కలెక్షన్స్ !

Published on May 13, 2019 9:18 AM IST

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘మహర్షి’ సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల వర్షం కురిపిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా మహర్షి నాలుగో రోజు వసూళ్లు ఎలా ఉన్నాయో చూద్దాం. ఏరియాల వారిగా ‘మహర్షి’ నాలుగు రోజుల వసూళ్ల వివరాలు పరిశీలిస్తే…

ముందుగా నైజాంలో మహర్షి నాలుగో రోజు 3.47 కోట్ల షేర్ గా ఉంది. అలాగే మొత్తం నాలుగు రోజులకుగానూ మాహర్షి నైజాం షేర్ 16.61 కోట్లుగా ఉంది. నాలుగో రోజులో కూడా ఒక తెలుగు సినిమాకి ఈ రేంజ్ కలెక్షన్స్ బాహుబలి 2 మాత్రమే వచ్చాయి. ఇప్పుడు ఆ రికార్డ్ ను మాహర్షి బ్రేక్ చేశాడు.

ఇక గుంటూరు విషయానికి వస్తే.. గుంటూరులో మహర్షి నాలుగో రోజు షేర్ 55 లక్షలుగా ఉంది. మొత్తం నాలుగు రోజులకు గానూ మాహర్షి గుంటూరులో 5.90 కోట్లును రాబట్టాడు.

ఇక కృష్ణా జిల్లాలో మహర్షి నాలుగో రోజు షేర్ 83,25,940 /-.. అలాగే మొత్తం నాలుగు రోజులకుగానూ మాహర్షి కృష్ణా లో 3,62,61,612/- లను కలెక్ట్ చేశాడు.

అలాగే నెల్లూరులో మహర్షి నాలుగో రోజు షేర్ 26 లక్షలుగా ఉంది. మొత్తం నాలుగు రోజులకుగానూ మాహర్షి నెల్లూరులో 1.74 కోట్లును సాధించాడు. మొత్తానికి ఈ చిత్రంతో మహేష్ తన కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు