మహర్షి విడుదలఫై మరో సారి క్లారిటీ ఇవ్వాల్సిందే !

Published on Mar 6, 2019 11:05 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 25వ చిత్రం ‘మహర్షి’ మళ్ళీ వార్తల్లోకెక్కింది. ఇటీవల రెండు సార్లు ఈ చిత్రం విడుదల గురించి నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. సినిమా ని ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న సమయానికి ఏప్రిల్ 25న థియేటర్లలోకి తీసుకువస్తామని ఆయన ప్రకటించారు. అయినా కూడా ఈచిత్రం మరో సారి వాయిదా పడనుందని వార్తలు వస్తున్నాయి. షూటింగ్ ఆలస్యం అవుతుండంతో సినిమా మే 9 న రిలీజ్ కానుందని ఈ వార్తల సారాంశం. మరి ఈ వార్తల ఫై చిత్ర బృందం ఏ వింధంగా స్పందిస్తారో చూడాలి.

ఇక ఇన్ని సార్లు సినిమా విడుదల వాయిదాపడనుందని వార్తలు రావడం గతంలో మహేష్ సినిమా కు ఎప్పుడు జరుగలేదు. మరి నిజంగానే ఈ సినిమా ను వాయిదా వేస్తారా లేక అనుకున్న సమయానికి విడుదలచేస్తారో అనే విషయం ఫై అతి త్వరలో క్లారిటీ రానుంది.

సంబంధిత సమాచారం :

More