మహర్షి రన్ టైం చాలా ఎక్కువ !

Published on May 4, 2019 10:48 am IST

మచ్ అవైటెడ్ మూవీ మహర్షి ఈనెల 9న గ్రాండ్ గా విడుదలకు సిద్దమవుతుంది. అందులో భాగంగా తాజాగా సెన్సార్ ను పూర్తి చేసుకుంది ఈ చిత్రం. ఇక సెన్సార్ బోర్డు ఈచిత్రానికి ఒక్క కట్ కూడా చెప్పకుండా యూ /ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. అలాగే ఈ చిత్రం యొక్క రన్ టైం కూడా రివీల్ అయ్యింది. 5నిమిషాల తక్కువ మూడు గంటల నిడివి(175నిమిషాల) తో ప్రేక్షకులముందుకు రానుంది ఈచిత్రం. మరి ఈ లెంగ్తి రన్ టైం సినిమా కు హెల్ప్ అవుతుందో లేదో చూడాలి.

వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో మహేష్ బాబు త్రీ షేడ్స్ లో కనిపించనున్నాడు. అందులో ఒకటి స్టూడెంట్ పాత్రకాగా మరొకటి సక్సెస్ ఫుల్ బిసినెస్ పర్సన్ గా అలాగే రైతు పాత్రలో కూడా కనిపించనున్నాడు. ఇక ఈచిత్రం లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా ప్రముఖ హీరో అల్లరి నరేశ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

సంబంధిత సమాచారం :

More