మూడో రోజు ‘బాహుబలి 2’ రికార్డ్ ను బ్రేక్ చేసిన ‘మాహర్షి’ !

Published on May 12, 2019 10:47 am IST

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా వచ్చిన ‘మహర్షి’ సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద మహేష్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింజైగ్స్ ను రాబడుతున్నాడు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం కొన్ని చోట్ల నాన్ బాహుబలి రికార్డు ను కూడా బ్రేక్ చేసింది. కాగా మాహర్షి నైజాం కలెక్షన్స్ శుక్రవారం కంటే శనివారం ఎక్కువగా ఉండటం విశేషం.

శనివారం నాడు మహర్షి నైజాంలో టిక్కెట్ కౌంటర్లలో డిస్ట్రిబ్యూటర్ షేర్ 3.47 కోట్లుగా ఉంది. మూడో రోజులో కూడా ఒక తెలుగు సినిమాకి ఈ రేంజ్ కలెక్షన్స్ బాహుబలి 2 మాత్రమే వచ్చాయి. ఇప్పుడు ఆ రికార్డ్ ను మాహర్షి బ్రేక్ చేశాడు.

కాగా నైజాంలో మహర్షి మొత్తం 3 రోజుల షేర్ 13.14 కోట్లుగా ఉంది. మొత్తానికి నైజాంలో మహేశ్ మార్కెట్ రేంజ్ ‘మహర్షి’ మరోసారి గుర్తు చేశాడు. గతంలో కూడా మహేశ్ సూపర్ హిట్ చిత్రాలు నైజాంలో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించాయి.

సంబంధిత సమాచారం :

More