మహర్షి పండగ రోజు కూడా !

Published on Sep 12, 2018 9:37 am IST

భరత్ అనే నేను చిత్రం తో బ్లాక్ బ్లాస్టర్ హిట్టు కొట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘మహర్షి’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇది ఆయనకు 25వ చిత్రం కావడం విశేషం. వంశీ పైడిపల్లి తెరక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైద్రాబాద్లోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతుంది. ఇక రేపు వినాయక చవితి రోజుకూడా సెలవు లేకుండా నాన్ స్టాప్ గా షూటింగ్ జరుగనుందట. ఇక ఈ షెడ్యూల్ తరువాత చిత్ర యూనిట్ తదుపరి షెడ్యూల్ కోసం విదేశాలకు వెళ్లనుంది.

ఈచిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా అల్లరి నరేష్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, పివిపి , అశ్విని దత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రేక్షకులముందుకు రానుంది ఈ చిత్రం.

సంబంధిత సమాచారం :