విజయోత్సవ వేడుకకు రెడీ అవుతోన్న ‘మాహర్షి’ !

Published on May 16, 2019 4:00 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘మహర్షి’ సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల వర్షం కురిపిస్తోన్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మహేష్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింజైగ్స్ ను రాబడుతున్నాడు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం కొన్ని చోట్ల నాన్ బాహుబలి రికార్డు ను కూడా బ్రేక్ చేసింది.

అందుకే చిత్రబృందం మాహర్షి విజయోత్సవ వేడుకను ఏర్పాటు చెయ్యడానికి రెడీ అవుతుంది. విజయవాడలో ఈ నెల 18వ తేదీన ఈ విజయోత్సవ సభను నిర్వహించనుంది. ఈ సినిమాలో రైతులకు సంబంధించి గొప్ప కంటెంట్ చూపించడంతో ప్రముఖల నుండి ప్రశంసలు అందుతున్నాయి.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించింది. అలాగే ప్రముఖ కామెడీ హీరో అల్లరి నరేష్ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటించాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం :

More